Pan Card-Aadhaar Link: పాన్‌కార్డును ఆధార్ కార్డులో అనుసంధానించేందుకు ఇవాళ ఒక్కరోజే మిగిలుంది. ఇప్పటికే పలుసార్లు గడువు పొడిగించిన ఇన్‌కంటాక్స్ ఈసారి పొడిగించకపోవచ్చు. కొంతమందికైతే తమ పాన్‌కార్డుతో ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో కూడా తెలియదు. చాలా సులభంగా ఒక ఎస్ఎంఎస్ ద్వారా పాన్‌కార్డు ఆధార్ కార్డు లింక్ జరిగిందో లేదో తెలుసుకోవచ్చు.
పాన్‌కార్డుతో ఆధార్ కార్డు లింకింగ్ అనేది చాలా అవసరం. లేకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఇబ్బంది తలెత్తవచ్చు. ఇంకా ఇతరత్రా చాలా అంశాల్లో సమస్యలు రావచ్చు. అందుకే ఇన్‌కంటాక్స్ శాఖ పాన్‌కార్డు-ఆధార్ కార్డు లింక్ కోసం చాలాసార్లు గడువు పొడిగిస్తూ వచ్చింది. ఇవాళ మే 31 చివరి తేదీ. మరోసారి గడువు పెంచే పరిస్థితి ఉండకపోవచ్చు. పాన్‌కార్డు-ఆధార్ కార్డు లింక్ అనేది పెద్ద కష్టమేం కాదు. ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్ విధానంలో కేవలం క్షణాల్లో చేయవచ్చు. అంతకంటే ముందు మీ పాన్‌కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయిందో లేదో తెలుసుకోండి. ఒక ఎస్ఎంఎస్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ లింక్ కాకుంటే అదే ఎస్ఎంఎస్ ద్వారా చాలా సులభంగా నిమిషంలో లింక్ చేయవచ్చు.
పాన్‌కార్డు-ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవడం
మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి UIDPAN టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ 12 అంకెల ఆధార్ నెంబర్ 10 అంకెల పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడీ మెస్సేజ్‌ను 567678 లేదా 56161కు పంపించాలి. అంతే మొబైల్‌కు పాన్ - ఆధార్ లింక్ స్టేటస్ మెస్సేజ్ వస్తుంది.
ఆధార్ కార్డులో పాన్‌కార్డును ఎస్ఎంఎస్ ద్వారా లింక్ చేయడమెలా
ఇది కూడా పై విధానమే. UIDPAN టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ మళ్లీ స్పేస్ ఇచ్చి పాన్ నెంబర్ టైప్ చేయాలి. ఈ మెస్సేజ్‌ను 567678 లేదా 56161కు పంపించాలి. పాన్‌కార్డు-ఆధార్ కార్డు లింక్ అయినట్టుగా మెస్సేజ్ వస్తుంది.
ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు-పాన్‌కార్డ్ లింక్ ఎలా చేయాలి
ఆన్‌లైన్ విధానంలో కూడా పాన్‌కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయవచ్చు. దీనికోసం ముందుగా eportal.incometax.gov.in లేదా incometaxindiaefiling.gov.in ఓపెన్ చేయాలి. ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత పాన్‌కార్డు, ఆధార్ కార్డు ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. ఇప్పుడు స్క్రీన్‌పై క్విక్ లింక్స్ క్లిక్ చేయాలి. ఆధార్ కార్డు ఎంపిక చేసుకుని పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ టైప్ చేయాలి. అంతే పాన్‌కార్డు-ఆధార్ కార్డు లింక్ అయినట్టుగా నిర్ధారిస్తూ మెస్సేజ్ కన్పిస్తుంది.
Also read: Indigo Summer Sale: కేవలం 1199 రూపాయలకే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అవకాశం, త్వరపడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook