Pan Aadhaar Link: బిగ్ రిలీఫ్.. పాన్-ఆధార్ లింక్ గడువు పొడగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

Pan Aadhaar Link Last Date Extended: పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పొడగించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ). ఇంకా చాలా మంది లింక్ చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు గడువు పొడగించినట్లు వెల్లడించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 28, 2023, 04:06 PM IST
Pan Aadhaar Link: బిగ్ రిలీఫ్.. పాన్-ఆధార్ లింక్ గడువు పొడగింపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

Pan Aadhaar Link Last Date Extended: కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పాన్‌తో ఆధార్ లింక్ చేయడానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు 30 జూన్ 2023 వరకు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. మార్చి 31వ తేదీ వరకు గడువు విధించగా.. ఇంకా చాలామంది లింక్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలోనే గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసేలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే.. పాన్ కార్డు డియాక్టివేట్ అవుతుంది. ఆ తరువాత ఆ కార్డును మీరు ఎక్కడా కూడా ఉపయోగించలేరు. ఇంకా ఆధార్ కార్డుతో పాన్ నంబరు లింక్ చేయకపోతే వెంటనే చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

 

పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి గడువును మార్చి 31 నుంచి జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. గడుపు పొడగించినందును ఎలాంటి ఇబ్బంది లేకుండా పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసుకోవాలని కోరింది. ఆధార్‌తో పాన్ లింక్ చేయకపోతే.. చర్యలు తప్పవని గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే.

కొత్త గడువు వరకు కూడా పాన్ కార్డ్ హోల్డర్ ఆధార్‌తో లింక్ చేయకపోతే.. పాన్ కార్డ్ నాన్-ఆపరేటివ్‌గా మారుతుంది. దీంతో బ్యాంక్ అకౌంంట్, డీ మ్యాట్ అకౌంట్ తెరవడం సాధ్యం కాదు. మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి నిబంధనలు అడ్డొస్తాయి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేరు. పన్ను చెల్లింపుదారుల నుంచి ఎక్కువ టీడీఎస్, టీసీఎస్ వసూలు చేస్తారు. ఇప్పటి వరకు 51 కోట్ల పాన్‌లతో ఆధార్‌ను అనుసంధానం చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాన్‌తో ఆధార్‌ను https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar వెబ్‌సైట్‌ను సందర్శించి లింక్ చేసుకోవచ్చు. 

 

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. పాన్-ఆధార్ లింక్ అయితే.. ఐటీఆర్ ఫైల్ చేయడం ఈజీ అవుతుంది. అన్ని లావాదేవీలను అడిట్ చేసేందుకు ఆదాయపన్ను శాఖకు సులభంగా ఉంటుంది. ట్రాన్సాక్షన్ల రిసిప్టులు, ఈ సిగ్నేచర్ వంటివి ఆదాయ పన్ను శాఖకు అందించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆధార్ ఈ-వెరిఫికేషన్ ద్వారా అన్ని ఆటోమెటిక్‌గా వెరిఫై అవుతాయి. అదేవిధంగా పాన్ కార్డు ద్వారా జరిగే మోసాలకు కూడా చెక్ పడనుంది. 

ఇలా లింక్ చేసుకోండి.. 

==> ఇప్పటికే మీ పాన్ కార్డ్‌ని ఆధార్‌తో లింక్ చేసి ఉంటే.. మీ స్టేటస్‌ని చెక్ చేసుకోండి.. https://www.incometax.gov.in/iec/foportal పోర్టల్‌కు వెళ్లండి .
==> ఇక్కడ ఉన్న 'లింక్ ఆధార్' స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి 
==> మీ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను నమోదు చేసి.. స్టాటస్ చెక్ చేసుకోండి.
==> ఇప్పటికే లింక్ చేసి ఉంటే.. లింక్ అయినట్లు మీకు డిస్‌ప్లేపై కనిపిస్తుంది. 
==> ఒకవేళ ఇంకా లింక్ చేయకపోతే.. https://www.incometaxindiaefiling.gov.in/home లింక్‌పై క్లిక్ చేయండి.
==> ఇక్కడ ఆధార్‌, పాన్ వివరాలను ఎంటర్ చేయండి
==> లింక్ నౌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> ఆ తర్వాత మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్‌తో లింక్ చేసినట్లు మెసేజ్ వస్తుంది.

Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్‌కు కూడా చేరదు.. మాజీ క్రికెటర్ జోస్యం

Also Read: TSRTC: భద్రాద్రి రాములోరి తలంబ్రాలకు అనూహ్య స్పందన.. రూ.116 చెల్లిస్తే నేరుగా మీ ఇంటికే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News