OPPO Reno 8T 5G Mobile: స్మార్ట్ ఫోన్స్‌లో ఒప్పో ఫోన్స్‌కి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఒప్పోలోనూ రెనో సిరీస్ ఫోన్లకు ఇంకా భారీ డిమాండ్ ఉంది. అందుకే ఒప్పో రెనో 8T 5G స్మార్ట్ ఫోన్ కోసం ఒప్పో లవర్స్ ఎంతో క్రేజీగా ఎదురుచూస్తున్నారు. ఒప్పో కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం ఒప్పో రెనో 8T 5G ఫోన్ కస్టమర్స్‌ని ఆకట్టుకునేలా 6.7 ఇంచ్ మైక్రో కర్వ్‌డ్ అమోల్డ్ స్క్రీన్‌తో రూపొందింది. అలాగే స్క్రీన్ డిస్‌ప్లేలో ఎలాంటి ఆలస్యం లేకుండా మెరుపు వేగంతో పనిచేసేలా 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది.
ప్రస్తుత సోషల్ మీడియా జమానాలో సెల్ఫీలకే అత్యంత ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో అద్భుతమైన ఇమేజ్ క్లారిటీ కోసం 16MP పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో ఉన్న మరో విశేషం ఏంటంటే.. ఒప్పో రెనో 8T 5G ఫోన్ 1.07 బిలియన్ కలర్స్‌ని మిలితం చేస్తూ FHD డిస్‌ప్లేని అందిస్తోంది.
ఒప్పో కంపెనీ తమ ఒప్పో రెనో 8T 5G ఫోన్‌ని ప్రమోట్ చేసుకోవడం కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకుంటోంది. ఇటీవల రణ్‌బీర్ కపూర్ తన అభిమాని ఫోన్‌ని తీసుకుని విసిరిసేన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఒప్పో రెనో 8T 5G ఫోన్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్లాన్ చేసిన క్రియోటివ్ యాడ్ క్యాంపెయిన్ వీడియోనే అని తరువాతే అర్థమైంది.
Just in case you’ve missed it, #RanbirKapoor hands a fan an upgrade of a lifetime with the new #OPPOReno8T 😉🔥
The new OPPO RENO 8T strikes the perfect balance between immersive visuals & a relaxed grip for an all-round premium experience ⚡️
Releasing Feb 3rd.#AStepAbove pic.twitter.com/8PBUZpZgrt
— OPPO India (@OPPOIndia) January 29, 2023
ఒప్పో రెనో 8T 5G స్మార్ట్ ఫోన్ వెనక భాగంలో మూడు కెమెరాలు ఉండగా.. అందులో ప్రైమరీ కెమెరా 108 MP కెమెరాను అమర్చారు. మొత్తానికి ఎట్రాక్టివ్ ఫీచర్స్‌తో లాంచ్ అవుతున్న ఈ ఫోన్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుందని ఒప్పో కంపెనీ చెబుతోంది. ఒప్పో రెనో 8T 5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 3న మార్కెట్‌లోకి లాంచ్ కానుండగా ఫిబ్రవరి 7 నుంచి కస్టమర్స్ కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి : Reasons For Rejecting Loans: శాలరీ భారీగా ఉన్నప్పటికీ.. బ్యాంకు లోన్ ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసా
ఇది కూడా చదవండి : Toyota Urban Cruiser Hyryder CNG: టయోటా నుంచి సూపర్ ఎస్‌యూవి కారు.. క్రెటా, గ్రాండ్ వితారా పరిస్థితి ఏంటి ?
ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook