Old vs New Tax System: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో అనేక రకాల ప్రకటనలు చేశారు. వీటిలో ముఖ్యంగా ఆదాయపు పన్ను చట్టం 1961 పై కాంప్రహెన్సివ్ రివ్యూను ప్రకటించారు. దీనిలో భాగంగా కొత్త పన్ను విధానంలో కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ను ప్రవేశపెట్టడంతోపాటు స్టాండర్డ్ డిడక్షన్ ను రూ. 50,000 నుంచి రూ. 75,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఎవరైతే న్యూ ట్యాక్స్ రెజిమ్ ను ఎంపిక చేసుకున్నారో ఈ నిర్ణయం ద్వారా రూ. 17,500 వరకు డబ్బును ఆదా చేసుకోనున్నారు.
ముఖ్యంగా వేతనాలు పొందే ఉద్యోగులు హోం లోన్స్ వడ్డీపై రూ. 2లక్షల వరకు క్లెయిమ్ చేసుకుంటే లేదంటే HRAకు అర్హులు కానట్లయితే కొత్త, సరళీకృత పన్ను విధానంలోకి మారడం మంచిది. ఏడాదికి రూ.7లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వేతనజీవులకు పాతపన్ను విధానమే లాభదాయకం. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి మాత్రం నూతన పన్ను విధానం శ్రేయస్కారం. ఎందుకంటే వేతనం తక్కువగా ఉంటుంది కాబట్టి డిడక్షన్స్ ఎక్కువగా క్లెయిమ్ చేసుకునే అవసరం లేదు. రూ. 7లక్షల లోపు వేతనం పొందేవారికి ఎలాంటి పన్ను ఉండదు. ఎందుకంటే వీరికి స్టాండర్డ్ డిడక్షన్ 75వేల రూపాయలకు పెంచారు కాబట్టి కొత్త పన్ను విధానం ఎంపిక చేసుకున్నవారికి ఇది లాభదాయకం.
Also Read : Union Budget 2024 Updates: నిర్మలమ్మ పద్దుతో ఏ ధరలు పెరగనున్నాయి, ఏవి తగ్గుతున్నాయి
ఉదాహరణకు, రూ. 11 లక్షల ఆదాయం కలిగిన జీతం పొందే ఉద్యోగి రూ. 3,93,750 కంటే ఎక్కువ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తే, పాత పన్ను విధానంలో పన్ను చెల్లింపు తక్కువగా ఉంటుంది. ఇప్పుడు, రూ.11 లక్షల ఆదాయం ఉన్న ఎవరైనా ఈ స్థాయి డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకుంటే వారికి పాతపన్ను విధానమే బెటర్. రూ. 30 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తి కూడా, రూ. 3,93,750 కంటే ఎక్కువ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు.
న్యూ ట్యాక్స్ రెజిమ్ కింద సవరించిన ట్యాక్స్ రేట్స్ ను పరిశీలిస్తే:
- 0 - రూ. 3 లక్షల వరకు ఆదాయం ఉంటే - ఎలాంటి ట్యాక్స్ లేదు
- రూ. 3 లక్షల - 7 లక్షల వరకు ఆదాయం ఉంటే - 5 శాతం పన్ను
-రూ. 7 లక్షల- 10 లక్షల వరకు ఆదాయం కలిగి ఉన్నవారికి - 10 శాతం పన్ను
- రూ. 10 లక్షల - 12 లక్షల వరకు ఆదాయం పొందుతున్నవారికి- 15 శాతం పన్ను
-రూ. 12 లక్షల - 15 లక్షల వరకు ఆదాయం ఉంటే - 20 శాతం పన్ను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook