Ola S1: మొదటి స్థానంలో Ola S1.. రేటును చూసి విచ్చలవిడిగా కొంటున్న జనాలు!

Ola Electric Scooter S1 On Road Price: మార్కెట్‌లో విడుదలవుతున్న Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి గుర్తింపు లభించింది. ఈ బైక్‌లో చాలా రకాల ఆధునాతన ఫీచర్లు ఉండడం వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 22, 2023, 04:23 PM IST
Ola S1: మొదటి స్థానంలో Ola S1.. రేటును చూసి విచ్చలవిడిగా కొంటున్న జనాలు!

Ola Electric Scooter S1 On Road Price: పెట్రోల్ రేట్లు విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను, కార్లను వినియోగిస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి కాలుష్యం లేకపోవడం వల్ల ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారి కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ OLA S1లకు మంచి గుర్తింపు ఉంది.  ఏప్రిల్‌ నెలలో ఓలా టూ వీలర్‌లు  21882 యూనిట్ల అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా మార్కెట్‌లో అత్యంత విక్రయించి ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో  OLA S1 ఒకటవ స్థానంలో నిలిచింది. TVS మోటార్స్ రెండవ స్థానంలో ఉందని నివేదికల్లో పేర్కొన్నారు. అయితే ఈ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

TFT స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్స్‌ వివరాలు ఇవే:
Ola S1 ఎయిర్ 4.5 kW బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ OLA S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు  స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్‌ ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో రైడింగ్ మోడ్‌లు, రివర్స్ మోడ్, సైడ్ స్టాండ్ అలర్ట్, OTA అప్‌డేట్‌లు, మ్యూజిక్ ప్లేబ్యాక్, రిమోట్ బూట్ లాక్-అన్‌లాక్, నావిగేషన్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్కూటర్‌లో చాలా రకాల కొత్త ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

మూడు వేరియంట్లలో ఈ బైక్‌:
భారత్‌లో ప్రస్తుతం Ola S1 బైక్‌ 5 రంగులతో పాటు 3 వేరియంట్లను కలిగి ఉంది. ఇక ధర విషయానికొస్తే రూ. 91,722 తో ఎక్స్-షోరూమ్ ధర ఉండగా వేరియంట్లను బట్టి ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని వేరియంట్స్‌లో డ్రమ్ బ్రేక్‌ల ఫీచర్లను పొందొచ్చు. అంతేకాకుండా ఇందులో ఫ్లాట్ ఫుట్‌బోర్డ్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో మీరు ఈ ఫీచర్‌ను వినియోగించి మరింత లగేజీని జర్నీలో తీసుకెళ్లొచ్చు.

Ola S1 ఎయిర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 87 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఇక ఈ స్కూటర్‌ బరువు విషయానికొస్తే.. దాదాపు 99 నుంచి 100కిలోల బరువును కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. కాబట్టి ఈ బైక్‌ను ఇరుకైన ప్రదేశాల్లో కూడా సులభంగా జర్నీ చేయోచ్చు. ఎస్1 ఎయిర్‌కు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్‌ ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఛార్జ్ విషయానికొస్తే..గరిష్టంగా నాలుగు గంటల పాటు ఛార్జింగ్‌ చేస్తే ఒక రోజు మొత్తం మీరు జర్మీని చేసే అవకాశాలున్నాయి. 

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News