New Business Ideas: వాడిపోయిన పూలతో కోట్ల రూపాయల సంపాదన

దేశంలో ఏ బిజినెస్ అయిన సరే పోటీ ఎక్కువగానే ఉంది. కొత్త బిజినెస్ పెడితే తప్ప త్వరగా లాభాలు చవిచూడలేము. అలాంటి ఆలోచన నుండే పుట్టిన ఒక బిజినెస్ ఏ వాడిపోయిన పువ్వుల రీసైక్లింగ్.. వీటితో కోట్లలో అర్జిస్తున్నారు ఇద్దరు యువకులు.. ఆ వివరాలు   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2023, 04:23 PM IST
New Business Ideas: వాడిపోయిన పూలతో కోట్ల రూపాయల సంపాదన

New Business Ideas: మన దేశంలో ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. కానీ, అలాంటి బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం కొత్త ఐడియాలు అమలు చేయాలి. అలా అయితేనే వ్యాపారం పెట్టిన వెంటనే లాభాల బాట పయనిస్తాం. అయితే ప్రస్తుతం రీసైక్లింగ్ బిజినెస్ కు మాత్రం ఎక్కడ చూసిన మంచి డిమాండ్ మార్కెట్ ఏర్పడింది. 

అలాంటి బిజినెస్ ల ద్వారా చాలా మంది కోట్లు సంపాదించుకుంటున్నారు. మన గ్రామీణ ప్రాంతాల్లో దొరికే పాత ఇనుము వస్తువులు, కొబ్బరి పీచు, పాత ప్లాస్టిక్ బాటిళ్లు వంటివి రీసైక్లింగ్ చేసి మార్కెట్లలో అమ్ముతూ కోట్ల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నారు. అంతటి ఓ విభిన్న ఐడియాతో వ్యాపారంలో దూసుకెళ్తున్నారు ఓ ఇద్దరు స్నేహితులు. 

బిజినెస్ సీక్రెట్ అది!
అంకిత్ అగర్వాల్, ప్రతీక్ కుమార్ అనే వారు మంచి స్నేహితులు. అయితే వారిద్దరూ ఎప్పటి నుంచో ఓ వ్యాపారాన్ని ప్రారంభించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో వారికి ఓ మంచి ఐడియా తట్టింది. వాడిపోయిన పూలతో బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని పెద్ద పెద్ద దేవాలయాలు లేదా శుభకార్యాల్లో ఎక్కువగా పూలను వినియోగిస్తుంటారు. అయితే అలా ఉపయోగించిన పూల కొంత సమయం తర్వాత వాడిపోతుంటాయి. 

Also Read: IND vs PAK Dream11 Prediction Today Match: పాక్‌తో టీమిండియా బిగ్‌ఫైట్‌.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇలా..  

అలా వాడిపోయిన పూలను చెత్తలో పాడేస్తే.. నీటిలో కలిసి కలుషితం అవుతాయి. ఆ పూలను వృథా కాకుండా.. వాటితే అగరబత్తీలను తయారు చేయడం ప్రారంభించారు ఆ ఇద్దరు స్నేహితులు. మంచి సువాసన వెదజల్లే పూలను ఎంచుకొని వాటితో అగరబత్తీలను తయారు చేసి మార్కెటింగ్ చేస్తూ.. కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. 

వాడిపోయిన పూలను ఎండబెట్టి, వాటిలో సువాసన కోసం రసాయనాలను చల్లి.. అగరబత్తీ పేస్ట్ ను తయారు చేస్తారు. ఇలాంటి అగరబత్తీలకు మన దేశంలో చాలా డిమాండ్ ఉంది.

Also Read: Chandrababu Arrest Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్, కేసు పరిణామాలిలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News