Interest Rates on FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఎన్బీఎఫ్సీ బ్యాంకులు

Interest Rates on FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు విషయంలో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలు కూడా రెగ్యులర్ బ్యాంకుల బాటలోనే ప్రయాణిస్తున్నాయి. ఆగస్టు 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2022, 08:52 PM IST
  • ఆగస్టు 5న రెపో రేటు పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • ఆర్బీఐ మానిటరీ పాలసీ సవరణ అనంతరం డిపాజిట్లపై పెరిగిన వడ్డీ రేట్లు
  • బ్యాంకుల బాటలోనే ఎన్బీఎఫ్సీ సెక్టార్ బ్యాంక్స్
Interest Rates on FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన ఎన్బీఎఫ్సీ బ్యాంకులు

Interest Rates on FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు విషయంలో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలు కూడా రెగ్యులర్ బ్యాంకుల బాటలోనే ప్రయాణిస్తున్నాయి. ఆగస్టు 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 50 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో పలు జాతీయ, కార్పొరేటు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాయి. తాజాగా అదే బ్యాంకుల బాటలో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సెకార్ట్‌కి చెందిన ఇంకొన్ని బ్యాంకులు కూడా అదే నిర్ణయం తీసుకుంటున్నాయి. తాజాగా వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకుల జాబితాలో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. 

1) శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్: ఆగస్టు 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు పెంచగా.. ఆ తర్వాతే శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ బ్యాంక్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన అనంతరం ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 8.25 శాతానికి పెంచగా సీనియర్ సిటిజెన్స్‌కి అందించే వడ్డీ రేటును 8.75 శాతానికి పెంచింది. అయితే, 5 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయని శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ స్పష్టంచేసింది.

2) ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : ఆర్బీఐ మానిటరీ పాలసీ విడుదలైన అనంతరం ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సైతం తమ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. సవరించిన అనంతరం సాధారణ పౌరులకు ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 7.50 శాతంగా ఉండగా.. సీనియర్ సిటిజెన్స్‌కి అందించే వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది.

రూ. 2 కోట్లకు పైగా ఉన్న డిపాజిట్లకు.. అది కూడా కనీసం 700 రోజుల నుండి 5 ఏళ్ల కాల పరిమితి కలిగిన డిపాజిట్లపై మాత్రమే ఈ పెంచిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్పష్టంచేసింది.

3) జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: కనీసం 3 ఏళ్ల నుండి 5 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.35 శాతానికి పెంచగా.. సీనియర్ సిటిజెన్స్‌కి అందించే వడ్డీ రేటును 8.15 శాతానికి పెంచినట్టు జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెల్లడించింది.

Also Read : Bank Holidays: సెప్టెంబర్ నెలలో బ్యాంకు పనులున్నాయా..ఆ నెలలో 14 రోజులు బ్యాంకుకు సెలవులే

Also Read : Gold Price Today 23 August: మగువలకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News