Cheque Signature Rules: చెక్ జారీ చేసేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని 10 తప్పులు

Cheque Signature Rules: బ్యాంకులకు సంబంధించిన అంశాల్లో చాలా నియమ నిబంధనలు ఉంటాయి. ఇవి పూర్తిగా తెలుసుకోకపోతే నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా చెక్స్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే అన్నీ సమస్యలే ఎదురైతాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 19, 2023, 12:40 PM IST
Cheque Signature Rules: చెక్ జారీ చేసేటప్పుడు పొరపాటున కూడా చేయకూడని 10 తప్పులు

Cheque Signature Rules: సాధారణంగా ఎక్కౌంట్ ఓపెన్ చేసేటప్పుడు బ్యాంకులు చెక్ బుక్, ఏటీఎం, పాస్‌బుక్ జారీ చేస్తుంటాయి. చెక్ అనేది ఎక్కువగా పెద్దమొత్తంలో నగదు లావాదేవీకు ఉపయోగిస్తారు. లేదా రికార్డ్ లావాదేవీలకు వాడుతుంటారు. అందుకే మీరు కూడా చెక్ వినియోగిస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏ చిన్న తప్పు కూడా చేయవద్దు.

చెక్ అనేది బ్యాంకింగ్ వ్యవస్థలో భాగంగా ఓ వ్యక్తి మరో వ్యక్తికి నగదు చెల్లించమని బ్యాంకుకు జారీ చేసేది. ఎవరికి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి పేరు ఆ చెక్‌పై రాసి తేదీ, నగదు నమోదు చేసి ఇస్తుంటారు. వ్యక్తి పేరుపై లేదా కంపెనీ పేరుపై చెక్ జారీ చేయవచ్చు. చెక్ జారీ చేసేటప్పుడు కొన్ని తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. లేకపోతే ఆ చెక్ ఆధారంగా చాలా సమస్యలు ఎదురోవల్సి వస్తుంది. చెక్ జారీ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..

మీరు ఎప్పుడు ఎవరికి చెక్ జారీ చేసినా నగదు నమోదు చేసేటప్పుడు ONLY అని రాయడం మర్చిపోవద్దు. నగదు చివర్లో ఇలా రాయడం వల్ల మోసాలను చాలావరకూ నియంత్రించవచ్చు. అందుకే నగదును అక్షరాల్లో రాసేటప్పుడు తప్పకుండా ఓన్లీ అనేది ప్రస్తావించి తీరాలి. 

ఎప్పుడూ ఎవరికీ బ్లాంక్ చెక్ ఇవ్వవద్దు. చెక్ సైన్ చేసేముందు ఎవరికి ఇస్తున్నారో వారి పేరు, నగదు, తేదీ తప్పకుండా చెక్‌పై రాసి ఇవ్వాలి. చెక్ ఎప్పుడూ పెన్‌తో రాయడం అలవాటు చేసుకోండి.

మీరు సంతకంలో తప్పులు దొర్లకూడదు. చెక్‌పై ఎప్పుడూ కచ్చితమైన సంతకం ఉండాలి. లేకుంటే ఆ చెక్ బౌన్స్ అవుతుంది. అందుకే చెక్ జారీ చేసేటప్పుడు ఆ చెక్ సంతకం సరిపోతుందో లేదో పోల్చి చూసుకోవాలి. మీ బ్యాంక్ ఎక్కౌంట్‌లో ఉన్న సంతకంతో చెక్ సంతకం సరిపోలితేనే సంబంధిత బ్యాంక్ నగదు విడుదల చేస్తుంది. లేకపోతే చెక్ బౌన్స్‌గా పరిగణలో వస్తుంది.

ఇక ఎవరికైనా చెక్ జారీ చేసేటప్పుడు చెక్‌పై తేదీ కచ్చితంగా ఉండేట్టు చూసుకోవాలి. తేదీలో తప్పులు ఉండకూడదు.

చెక్ టాంపెరింగ్ కాకుండా ఉండాలంటే చెక్ పై ఎప్పుడూ పర్మనెంట్ ఇంక్ మాత్రమే వాడితే మంచిది. దీనివల్ల ఆఆ చెక్ మార్చడానికి లేదా చెరపడానికి ఆస్కారం ఉండదు.

బ్యాంకులో ఎప్పుడూ మీరు జారీ చేసిన చెక్కులకు సబంంధించిన నగదు మొత్తం ఉండేట్టు చూసుకోండి. బ్యాలెన్స్ లేదనే కారణంతో చెక్ బౌన్స్ అయితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే తగినంత నగదు బ్యాంక్ ఎక్కౌంట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. 

పోస్ట్ డేటెడ్ చెక్స్ సాధ్యమైనంతవరకూ దూరం చేయండి. చెక్ తేదీ అనేది చాలా ముఖ్యమైంది. తేదీ, నెల, సంవత్సరం తప్పుగా రాస్తే ఆ చెక్ చెల్లదు.

ఎవరికైనా చెక్ జారీ చేసినప్పుడు ఆ చెక్ నెంబర్ నోట్ చేసుకోవడం చాలా అవసరం. ఎక్కడైనా డైరీలో సురక్షితమైన చోట రాసుకుని ఉంటే మంచిది. ముఖ్యంగా ఇతరులకు ఇచ్చిన చెక్ నెంబర్లు రాసుకుని ఉండాలి.

Also read: POCO X5 Pro 5G: 108 మెగాపిక్సెల్ కెమేరా ఇప్పుడు కేవలం 749 రూపాయలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News