Zuck Bucks: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ 'మెటా' తమ సొంత డిజిటల్ కరెన్సీపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ డిజిటల్ కరెన్సీని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ పేరుమీద తీసుకురానున్నట్లు సమాచారం. 'జూక్ బక్స్' పేరుతో ఈ డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
నిజానికి మెటాగా ఫేస్బుక్ రీబ్రాండ్ అవకముందు.. లిబ్రా పేరుతో క్రిప్టో కరెన్సీపై కసరత్తు చేసింది. ఈ ప్రాజెక్టులో వివిధ దిగ్గజ సంస్థలు కూడా భాగస్వామ్యమయ్యాయి. అయితే వివిధ నియంత్రణ సంస్థల, దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీనితో కంపెనీలు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాయి. మెటాగా రీబ్రాండింగ్ అయిన తర్వాత కూడా డియమ్ పేరుతో డిజిటల్ కరెన్సీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది అయినప్పటికీ.. ఆ ప్రాజెక్టు కూడా మందుకు సాగలేదు.
నియంత్రణ సంస్థలు, వివిధ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న డిజిటల్ కరెన్సీపై ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ దానిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మెటావర్స్‌లో ఈ-కామర్స్, ఫినాన్షియల్ టూల్స్ ప్రాముఖ్యత గురించి ఎప్పటికప్పుడు విశ్లేషిస్తునే ఉన్నారు. ఇందులో భాగంగానే మరోసారి 'జూక్ బక్స్' పేరుతో డిజిటల్ కరెన్సీ తీసుకురావని నిర్ణయించినట్లు సమాచారం.
మెటావర్స్‌లో గేమింగ్స్ వంటి అవసరాలకు దీనిని ముందుగా వినియోగించాలని మెటా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ విజయవంతమైతే ఇతర అవసరాలకు ఈ కరెన్సీని ఉపయోగించొచ్చని సమాచారం. అయితే ఈ కొత్త కరెన్సీకి సంబంధించిన మెటా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also read: Stock Markets: మూడో రోజూ మార్కెట్ల బేజారు.. సెన్సెక్స్ 575 పాయింట్లు డౌన్
Also read: Google New Feature: టోల్ గేట్స్ పై అదిరే ఫీచర్ ప్రవేశపెట్టిన గూగుల్ మ్యాప్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook