Maruti Suzuki Upcoming 7 Seater Cars 2023: ప్రస్తుతం భారత మార్కెట్‌లో ప్రముఖ కార్ల తయారీదారు 'మారుతి సుజుకి'కి మంచి డిమాండ్ ఉంది. మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల సంస్థలలో మారుతి ఒకటిగా ఉంది. ఇతర కంపెనీలకు పోటీగా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ తీసుకొస్తూ.. మార్కెట్‌లో సత్తాచాటుతోంది. ఈ క్రమంలోనే మారుతీ సుజుకి భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. మారుతీ కంపెనీ ఈ సంవత్సరం మూడు కొత్త యుటిలిటీ వెహికల్స్ (Utility Vehicle) లాంచ్ చేస్తుంది.
ఇండో-జపనీస్ కార్‌మేకర్ మారుతి సుజుకి మూడు కొత్త యుటిలిటీ వెహికల్స్ (UV) లాంచ్ చేస్తుంది. వీటిలో ఫ్రాంక్ క్రాస్ఓవర్, జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారిత ఎంపీవీగా ఉంటాయి. అంతేకాకుండా గ్రాండ్ విటారా 7-సీటర్ వెర్షన్‌ను కూడా తీసుకువస్తుంది. ఇది మహీంద్రా XUV700 మరియు టాటా సఫారితో పోటీపడనుంది. కొత్త మారుతి 7-సీటర్ కార్ల గురించి వివరాలు ఓసారి చూద్దాం.
MARUTI 7-SEATER SUV:
నివేదికల ప్రకారం మారుతి సుజుకి కొత్త 7-సీటర్ ఎస్‌యూవీ.. గ్రాండ్ విటారా మోడల్‌గా రూపొందించబడుతుంది. ఇందులో గ్రాండ్ విటారా ప్లాట్‌ఫాం, పవర్‌ట్రెయిన్ మరియు ఫీచర్లు ఉంటాయి. ఇది 1.5L K15C పెట్రోల్ ఇంజన్ మరియు 1.5L అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ సెటప్‌తో రానుంది. కొత్త మారుతి 7-సీటర్ ఎస్‌యూవీ హర్యానాలోని కార్‌మేకర్ యొక్క ఖర్ఖోడా ఫెసిలిటీలో ఉత్పత్తి చేయబడుతుంది. ఈ కార్ గ్లోబల్ సి ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుంది. ఈ కొత్త కారు 3-వరుసల సీటింగ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. బాహ్య మరియు లోపలి భాగంలో కొన్ని మార్పులు ఉంటాయి.
MARUTI 7-SEATER MPV:
రాబోయే మారుతి 7-సీటర్ ఎంపీవీ.. మారుతి సుజుకి సంస్థ నుంచి మొదటి రీ-బ్యాడ్జ్ చేయబడిన టయోటా కారు. ఇది ఇన్నోవా హైక్రాస్ ఆధారిత ఎంపీవీ. ఇది 2.0 లీటర్, 4-సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ మరియు 2.0 లీటర్ NA పెట్రోల్ ఇంజన్ ఎంపికలను కలిగి ఉంటుంది. బలమైన హైబ్రిడ్ సెటప్ 184bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. అయితే తేలికపాటి హైబ్రిడ్ సిస్టమ్ 172bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు. FWD డ్రైవ్‌ట్రెయిన్ సిస్టమ్ మోడల్ లైనప్‌లో ప్రామాణికంగా ఉంటుంది. ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) పొందిన మొదటి మారుతి సుజుకి కారు ఇదే.
Also Read: U-19 Womens T20 World Cup 2023 Final: న్యూజిలాండ్‌పై ఘన విజయం.. ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్!
Also Read: IND vs NZ 1st T20I: టాస్ గెలిచిన భారత్.. చహల్, పృథ్వీ షాకి దక్కని చోటు! తుది జట్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.