Maruti Suzuki launch Brezza Black Edition in India: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మారుతి సుజుకి' కొంతకాలం క్రితం బ్లాక్ ఎడిషన్‌లో కొన్ని కార్లను విడుదల చేసింది. బ్లాక్ కలర్‌తో షోరూమ్‌కి చేరిన మొదటి కారు 'మారుతి సుజుకి బ్రెజ్జా'. ఇక వినియోగదారులు ఇప్పుడు మారుతి బ్రెజాను బ్లాక్ ఎడిషన్‌లో కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ ప్రత్యేక ఎడిషన్ కారు యొక్క టాప్ ZXi మరియు ZXi+ వేరియంట్‌లపై ఆధారపడి ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన సీఎన్‌జీ మోడల్ కూడా నలుపు రంగులో అందుబాటులో ఉంటుంది.
Brezza Black Edition Price:
మిగిలిన రంగులతో పోలిస్తే ప్రత్యేకమైన అనుభూతిని అందించినప్పటికీ.. బ్రెజా యొక్క బ్లాక్ ఎడిషన్ ధరను మారుతి సుజుకి కంపెనీ ఇతర రంగులతో సమానంగా ఉంచింది. బ్రెజా బ్లాక్ ఎడిషన్ ధర రూ. 10.95 లక్షల నుంచి మొదలై రూ. 13.88 లక్షల వరకు ఉంది. 2023 ఫిబ్రవరి నెలలో టాటా నెక్సాన్‌ను కంటే అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా బ్రెజా నిలిచింది. బ్రెజ్జా బ్లాక్ ఎడిషన్ యొక్క ZXi మరియు ZXi+ వేరియంట్‌లలో ఆల్-బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లోటింగ్ LED DRLలు, బ్లాక్ క్లాడింగ్ మరియు సైడ్ మౌల్డింగ్‌లు, బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
Brezza Black Edition Features:
బ్రెజా బ్లాక్ ఎడిషన్ లోపలి భాగంలో ఎస్‌యూవీ డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్ మరియు డిజిటల్ TFT MIDతో కూడిన 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పుష్ బటన్ (స్టార్ట్/స్టాప్)ను కలిగి ఉంది. ZXi+ ట్రిమ్ Android Auto మరియు Apple CarPlayతో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్‌ప్లే యూనిట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్‌తో వస్తుంది. ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉంటుంది.
Brezza CNG Black Edition Price:
మారుతి సుజుకి కంపెనీ ఇప్పటికే సీఎన్‌జీ ఎంపికలో బ్రెజాను కొంతకాలం క్రితం ప్రారంభించింది. బ్రెజ్జా ఎస్-సీఎన్‌జీ (S-CNG) నాలుగు వేరియంట్‌లలో ( LXi S-CNG, VXi S-CNG, ZXi S-CNG మరియు ZXi S-CNG డ్యూయల్ టోన్) అందుబాటులో ఉంది. వాటి ధర వరుసగా రూ. 9.14 లక్షలు, రూ. 10.49 లక్షలు, రూ. 11.89 లక్షలు, రూ. 12.05 లక్షలు ఉన్నాయి. సీఎన్‌జీ మోడల్‌లు సాధారణ పెట్రోల్ వేరియంట్‌ల మాదిరిగానే ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి