Marriage Loan: బంపర్ ఆఫర్.. పెళ్లి ఖర్చుల కోసం ఇలా కూడా లోన్ లు తీసుకోవచ్చు.. డిటెయిల్స్ ఇవే..

Big Update: చాలా మంది పెళ్లిని గ్రాండ్ గా చేసుకొవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు. దీని కోసం ఎంత ఖర్చుచేయడానికి కూడా వెనుకాడరు. ఈవెంట్ మెనెజర్ లను కూడా మీట్ అయి వెడ్డింగ్ ప్లాన్ లు చేస్తారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 31, 2024, 07:31 PM IST
  • - కాస్లీ వెడ్డింగ్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్న యువత..
    - పెళ్లికి ఇలా కూడా ఈజీగా లోన్ తీసుకోవచ్చు..
Marriage Loan: బంపర్ ఆఫర్.. పెళ్లి ఖర్చుల కోసం ఇలా కూడా లోన్ లు తీసుకోవచ్చు.. డిటెయిల్స్ ఇవే..

Four Options For Wedding Loan: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప అనుభూతి. వివాహం చేసుకుని భాగస్వామితో కలసి మంచి జీవితంలోకి అడుగుపెట్టాలని ప్రతిఒక్కరు కలలు కంటారు. అందుకే నేటి యువత పెళ్లి కోసం ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. మనలో చాలా మంది మధ్య తరగతి చెందిన వారే ఉంటారు.

ఈ క్రమంలో పెళ్లి ఖర్చుల కోసం కొందరు అప్పులు చేస్తుంటే, మరికొందరు బ్యాంకులలో రుణాలు కూడా తీసుకొవడం మనం చూస్తుంటాం. అయితే.. తాజాగా.. పెళ్లి ఖర్చుల కోసం రుణాలను మరో నాలుగు మార్గాలతో ఈజీగా పొంద వచ్చు.

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్..
 
ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరు పీఎఫ్ ఖాతాను కల్గిఉంటారు. వీరి జీతం నుంచి ప్రతినెల కొంత అమౌంట్ కట్ అవుతుంది. అయితే.. ఉద్యోగం చేస్తు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఈపీఎఫ్ నుంచి రూ. యాభై వేలను సదరు ఉద్యోగి విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఎల్ఐసీ నుంచి రుణం..

ఎల్ఐసీ నుంచి కూడా పెళ్లికి లోన్ ను పొందవచ్చు. దీనిలో పాలసీ విలువలో 80 నుంచి 90 శాతం వరకు రుణం తీసుకొవడానికి వెసులుబాటు ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటి ద్వారా అప్లై చేసుకొవచ్చు

గోల్డ్ లోన్..

కొన్ని బ్యాంక్ లు, నాన్ బ్యాంక్ సంస్థలు బంగారం ను కొదువ పెట్టుకుని లోన్ ఇస్తాయి. కొదువ పెట్టే  బంగారం ను బట్టి రూ. రూ. 50 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు.

పర్సనల్ లోన్..

పర్సనల్ లోన్ ను ఏ బ్యాంక్ నుంచైన తీసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి వస్తువులను తాకట్టు పెట్టాల్సిన అవసరంలేదు. కానీ రుణం తీసుకునేటప్పుడు మీ జీతం స్లిప్, ఫోటో, కేవైసీ మొదలైనవి సమర్పించాలి. రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీకు 12 నెలల నుండి 60 నెలల వరకు సమయం లభిస్తుంది.

Read Also: Ayodhya: హనీమూన్ కోసం అయోధ్య కు వెళ్దామన్న భర్త.. కొత్త పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా..?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News