Cough Syrup Tragedy: భారతదేశంలో తయారైన దగ్గుమందు పశ్చిమ ఆఫ్రికా ప్రాంతంలో 66 మంది చిన్నారుల ప్రాణాల్ని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ మెడికల్ అలర్ట్ జారీ చేసింది. ఆ అలర్ట్‌లో సంచలన విషయాలున్నాయి. దగ్గు సిరప్ తయారు చేసిన కంపెనీపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
ఇండియాలోని హర్యానాలో ఉన్న మైడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయింది. ఆ కంపెనీ దగ్గుమందు తీసుకుని పశ్చిమ ఆఫ్రికాలోని గాంబియాలో 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో మెడికల్ అలర్ట్ జారీ చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. అంతేకాకుండా నాలుగు రకాల దగ్గు మందులు చిన్నారుల మృతికి కారణమయ్యాయని తెలిపింది. ఇందులో డై ఇథనీల్ గ్లైకాల్, ఇథలీన్ గ్లైకాల్ మందు మోతాదుకు మించి ఉందని వెల్లడించింది. ఇది పూర్తిగా విషపూరితమని..మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుందని హెచ్చరించింది.
ఈ కంపెనీ మందులు నాణ్యతా ప్రమాణాలకు దీటుగా లేవని తేలింది. అత్యంత చెత్త రికార్డు కలిగిన ఫార్మా కంపెనీలను వియత్నాం బ్లాక్ లిస్ట్ చేయగా..అందులో మైడెన్ ఫార్మాస్యూటికల్స్ కూడా ఉంది. వాస్తవానికి 2011లో ఈ కంపెనీని నిషేధిస్తే..తరువాత అనుమతి ఎలా లభించిందనేది తెలియలేదు. మందుల కంపెనీ ఎగుమతులకు అనుమతి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని..మరి ఈ కంపెనీకు అనుమతి ఎలా లభించిందో అర్ధం కాలేదు. దేశంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పనితీరుపై సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మైడెన్ ఫార్మా కంపెనీకు సంబంధించిన పలు మందుల నాణ్యతపై దేశంలో బీహార్, గుజరాత్, జమ్ము కశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది. అటు వియత్నాం కూడా ఈ కంపెనీకు చెందిన ఓ మందును నిషేదించింది.
1990 నవంబర్‌లో కార్యకలాపాల్ని ప్రారంభించిన మైడెన్ కంపెనీ గాంబీయాకు మాత్రమే దగ్గు సిరప్ ఎగుమతి చేసేదని తెలుస్తోంది. గాంబియా విషాదం తరువాత ఇప్పుడు భారదేశం గాంబీయా మందుల్ని పరీక్షిస్తోంది.
Also read: Multibagger stocks: 20 ఏళ్లలో లక్ష రూపాయల షేర్లు, 32 కోట్లుగా మారిన వైనం, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook