Home Loan Interest Rates: తక్కువ వడ్డీతో హోమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకుల వివరాలివే

Home Loan Interest Rates: సొంతిళ్లు అనేది ప్రతి ఒక్కడి కల. స్థోమతను బట్టి ఇళ్లు ఉంటుంది అంతే. ఇళ్లు కట్టుకోవాలంటే అత్యధిక శాతం బ్యాంకు రుణంపైనే ఆధారపడుతుంటారు. మరి తక్కువ వడ్డీరేట్లతో రుణాలిచ్చే బ్యాంకులేంటో పరిశీలిద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 26, 2022, 05:29 PM IST
 Home Loan Interest Rates: తక్కువ వడ్డీతో హోమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకుల వివరాలివే

Home Loan Interest Rates: సొంతిళ్లు అనేది ప్రతి ఒక్కడి కల. స్థోమతను బట్టి ఇళ్లు ఉంటుంది అంతే. ఇళ్లు కట్టుకోవాలంటే అత్యధిక శాతం బ్యాంకు రుణంపైనే ఆధారపడుతుంటారు. మరి తక్కువ వడ్డీరేట్లతో రుణాలిచ్చే బ్యాంకులేంటో పరిశీలిద్దాం.

ఓన్ హోమ్ కావాలంటే హోమ్ లోన్ తప్పనిసరి. హోం లోన్ లేకుండా ఎవరూ ఇళ్లు కొనుగోలు చేయడం కానీ కొత్త ఇళ్లు కట్టుకోవడం కానీ దాదాపు అసాధ్యం. అదే సమయంలో బ్యాంకులు కూడా హోమ్ లోన్ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటాయి. బ్యాంకుని బట్టి వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలో అతి తక్కువ వడ్డీరేట్లతో హోమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు కూడా ఉన్నాయి. హోమ్ లోన్ తీసుకునే ముందు అది పరిశీలించాలి. మార్కెట్‌లో ఉన్న బ్యాంకుల్లో ఏ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు ఎలా ఉందనేది నిర్ధారించుకోవాలి. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బ్యాంకుల్లో 6.5 శాతం నుంచి 12.5 శాతం వరకూ వడ్డీ వసూలు చేసే బ్యాంకులు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే హోమ్ లోన్ తీసుకునే ముందు ఆ బ్యాంకు ఏ వడ్డీ రేటుకు రుణమిస్తుందనేది పరిశీలించాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం చాలా వరకూ బ్యాంకులు పోటీ వాతావరణం కారణంగా 6.5 శాతం వడ్డీరేటుతో హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. హోమ్ లోన్స్ అనేవిద సాధారణంగా 15-20 సంవత్సరాల టెన్యూర్‌తో ఉంటాయి. అందుకే తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకు చూసుకోవడం ఉత్తమం. లేకపోతే చాలావరకూ నష్టపోతాం. ఇంటిరుణాలిచ్చే బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ప్రాంతాన్ని బట్టి, ప్రాపర్టీ విలువను బట్టి నిబంధలు విధిస్తుంటాయి. అన్ని బ్యాంకులకు ఒకటే నిబంధనలుండవు. కొన్ని బ్యాంకులైతే మహిళలకు వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. ఇక మరోవైపు క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉన్నా కూడా వడ్డీ రేటు తగ్గుతుంది. ప్రస్తుతం తక్కువ వడ్డీరేటుకు హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 6.4 శాతంతో హోమ్ లోన్ అందిస్తుంది. అటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6.4 శాతంతో, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.5 శాతంతో, బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5 శాతంతో, కోటక్ మహీంద్ర 6.55 శాతంతో హోమ్ లోన్స్ ఇస్తున్నాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలంటే..క్రెడిట్ హిస్టరీ బాగుండేట్టు చూసుకోవాలి. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ రేటును బ్యాంకులు తగ్గించేందుకు అంత వీలుంటుంది. 

Also read: Redmi Note 11 Pro launch: మార్చ్ 9న ఇండియాలో లాంచ్ కానున్న రెడ్‌మి నోట్ ప్రో- ప్రో ప్లస్ , ధర ఎంతంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News