Jio Airtel: మీరు జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లా.. రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే...

Jio and Airtel 1GB Data Plans: మీరు జియో లేదా ఎయిర్‌టెల్ కస్టమర్లా... అయితే ఈ రెండింటిలో చౌక ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 09:17 AM IST
  • మీరు ఎయిర్‌టెల్, జియో కస్టమర్లా...అయితే ఇది మీకోసమే...
  • ఈ రెండు టెలికాం సంస్థలు అందిస్తున్న బెస్ట్ డేటా ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి
  • రూ.300 లోపు బెస్ట్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే
Jio Airtel: మీరు జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లా.. రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే...

Jio and Airtel 1GB Data Plans: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్, డేటా వినియోగం బాగా పెరిగిపోయింది. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా చాలా పనులను స్మార్ట్‌ఫోన్, డేటా సాయంతో చక్కబెట్టుకునే వెసులుబాటు దొరికింది. సినిమాలు, ప్రయాణాలకు టికెట్లు బుక్ చేయాలన్నా.. బిల్లులు చెల్లించాలన్నా... ఇలా ప్రతీది అరచేతిలో స్మార్ట్‌ఫోన్ నుంచే కానిచ్చేయొచ్చు. ఈ నేపథ్యంలో డేటా వినియోగానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఆ డిమాండ్‌కు తగినట్లే టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ప్లాన్స్‌ను ముందుకు తెస్తున్నాయి. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్స్‌లో రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 

జియో 1జీబీ డేటా ప్లాన్ :

జియో రూ. 149 ప్రీపెయిడ్‌ ప్లాన్: ఈ ప్లాన్‌తో జియో కస్టమర్స్ ప్రతిరోజూ 1GB డేటాను పొందవచ్చు. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. 20 రోజుల వాలిడిటీతో కూడిన ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందవచ్చు.

జియో రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్: జియో అందిస్తున్న ఈ ప్లాన్‌తో రోజుకు 1జీబీ డేటా పొందుతారు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు ఏ నెట్‌వర్క్‌తోనైనా అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. 28 రోజుల వాలిడిటీతో కూడిన ఈ ప్లాన్‌తో అన్ని జియో యాప్స్‌కి యాక్సెస్ పొందుతారు.

ఎయిర్‌టెల్ 1జీబీ డేటా ప్లాన్:

ఎయిర్‌టెల్ రూ. 209 ప్రీపెయిడ్ ప్లాన్: ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్‌ వాలిడిటీ 21 రోజులు. రోజుకు 1జీబీ డేటాతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ఫ్రీ ట్రయల్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 239 ప్రీపెయిడ్ ప్లాన్: ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 1జీబీ ఇంటర్నెట్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌తో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ఫ్రీ ట్రయల్ కూడా పొందుతారు. ఈ ప్లాన్ వాలిడిటీ 24 రోజులు.

ఎయిర్‌టెల్ రూ. 265 ప్రీపెయిడ్ ప్లాన్: ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్‌తో ఏ నెట్‌వర్క్‌కైనా 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు, రోజుకు 1జీబీ డేటా పొందుతారు. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ వెర్షన్ ఫ్రీ ట్రయల్ కూడా పొందుతారు.

Also Read: Christiano Ronaldo: విషాదం... రొనాల్డో దంపతులకు పుట్టిన కవలల్లో ఒకరి మృతి..

Also Read: Anakapalli: సర్‌ప్రైజ్ గిఫ్ట్ అంటూ కళ్లు మూసుకోమంది... కత్తితో గొంతులో పొడిచింది.. కాబోయే భర్తపై యువతి దాడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News