IRCTC Refund Rules: సాధారణంగా ఛార్ట్ ప్రిపేర్ అయిన తరువాత టికెట్ కేన్సిల్ చేయలేం. ఒకవేళ చేసినా డబ్బులు వెనక్కి రావు. ఇప్పటివరకూ అందరికీ తెలిసింది ఇదే. కానీ మారిన ఐఆర్సీటీసీ నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఛార్ట్ సిద్ధమయ్యాక టికెట్ కేన్సిల్ చేసినా పూర్తిగా డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి. అదెలాగో చూద్దాం.
ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ ద్వారా టీడీఆర్ ఫైలింగ్ ఇలా
ఛార్ట్ ప్రిపేర్ అయిన తరువాత కన్ఫాం టికెట్ రద్దు చేసి రిఫండ్ పొందాటంటే ఈ సూచనలు పాటించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా IRCTC Website ఓపెన్ చేసి మీ ఎక్కౌంట్ లాగిన్ కావాలి.ఇందులో బుక్ టికెట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇందులోంచి కేన్సిల్ టికెట్ క్లిక్ చేయాలి. ఫైల్ టికెట్ డిపాజిట్ రిసీఫ్ట్ క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో కన్పించే ఫైల్ టీడీఆర్ క్లెయిమ్ చేయాలి. ఇప్పుడు అక్కడ అడిగిన విధంగా టీడీఆర్ ఫైలింగ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో టీడీఆర్ ఫైలింగ్ ఎలా
ముందుగా ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ఓపెన్ చేసి ఎక్కౌంట్ లాగిన్ అవాలి. మీ ట్రైన్ ఏంటో ఎంచుకోవాలి. మై బుకింగ్స్‌లో వెళ్లి టికెట్ క్యాన్సిల్లేషన్ ఎంచుకోవాలి. ఆ తరువాత క్యాన్సిల్ క్లిక్ చేయాలి. తిరిగి డ్యాష్ బోర్డ్‌లో వచ్చి పైల్ టీడీఆర్ క్లిక్ చేయాలి. తగిన కారణాన్నినమోదు చేసి టీడీఆర్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి. ఇలా టీడీఆర్ ఫైల్ చేస్తే పూర్తి రిఫండ్ చేతికి అందే అవకాశాలున్నాయి.
Also read: Diabetes Diet: మధుమేహహం వ్యాధిగ్రస్థులకు వెజ్, నాజ్ వెజ్‌లో ఏది మంచిది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook