Top 5 Mileage Bikes: అధిక మైలేజ్ ఇచ్చే బైక్స్ అంటేనే అందరికీ ఆసక్తి ఉంటుంది. రోజూ 30-40 కిలోమీటర్లు ప్రయాణం చేసేవారికి ఇది మరింత అవసరం. అందుకే మైలేజ్ ఎక్కువగా ఇచ్చే టాప్ 5 బైక్స్ గురించి, వాటి ఫీచర్ల గురించి ఓ సారి పరిశీలిద్దాం. అదే సమయంలో మైలేజ్ పెరగాలంటే ఏం చేయోలో కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం.
బజాజ్ ప్లాటినా 110
ఈ బైక్ మైలేజ్ లీటర్‌కు దాదాపుగా 70-75 కిలోమీటర్లు ఉంటుంది. 115 సిసి ఇంజన్ ఉంటుంది. కంఫర్టబుల్ సస్పెన్షన్, ట్యూబ్‌లెస్ టైర్స్, డీటీఎస్ ఐ ఇంజన్ టెక్నాలజీ ఉన్నాయి.
టీవీఎస్ స్పోర్ట్
ఈ బైక్ దాదాపుగా 70-75 కిలోమీటర్ల మేలేజ్ ఇస్తుంది. 110 సిసి ఇంజన్‌తో ఉంటుంది. ఈకోత్రస్ట్ ఇంజన్, స్లీక్ డిజైన్, లైట్ వెయిట్ ఉంటుంది.
హీరో స్ప్లెండర్ ఇస్మార్ట్
ఈ బైక్ 113.2 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. మైలేజ్ లీటర్ పెట్రోల్‌పై 68-70 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో ఐ3 ఎస్ టెక్నాలజీ ఉంటుంది. స్టైలిష్ లుక్ ఉంటుంది.
హోండా సిడి 110 డ్రీమ్
ఈ బైక్ 109.5 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. మైలేజ్ లీటర్ పెట్రోల్‌పై 65-70 కిలోమీటర్లు ప్రయాణించగలదగు. హోండా ఈకో టెక్నాలజీతో పొడుగ్గా, కంఫర్టబుల్ సీటింగ్‌తో ఉంటుంది.
హీరో హెచ్ఎఫ్ డీలక్స్
ఈ బైక్ 97.2 సిసి ఇంజన్ కలిగి ఉంటుంది. మైలేజ్ లీటర్ పెట్రెల్‌పై65-70 కిలోమీటర్లు ప్రయాణించగలదు.
బైక్స్ ఇంజన్ ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ ఇంజన్ ఆయిల్ మార్చడం, ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడం వంటివి చేస్తుండాలి. దీనివల్ల మైలేజ్ పెరుగుతుంది. టైర్ ప్రెషర్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయాలి. గాలి తక్కువగా ఉంటే ఇంజన్‌పై ఒత్తిడి లేదా భారం పెరిగి మైలేజ్ తగ్గిపోతుంది. సడెన్ బ్రేక్స్, బై స్పీడ్ మంచిది కాదు. బైక్ ఎప్పుడూ ఒకే రీతిలో డ్రైవింగ్ ఉండాలి. క్లచ్ ఉపయోగం అవసరమైనప్పుడే చేయాలి. అవసరం లేనప్పుడు క్లచ్ నొక్కి ఉంచకూడదు. కార్బొరేటర్ సరిగ్గా ట్యూన్ చేయడం, క్లీనింగ్ చేస్తుండాలి.
Also read: Income Tax Notice: తండ్రీ కొడుకులు భార్యాభర్తల లావాదేవీలపై నోటీసులు వస్తాయా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Top 5 Mileage Bikes: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే, మీ కోసం మైలేజ్ టిప్స్