Indian Railway: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఇండియన్ రైల్వే సరికొత్త సౌకర్యం కల్పిస్తోంది. రైల్వే టికెట్ క్యాన్సిల్ చేస్తే ఇకపై ఛార్జ్ ఉండదట. నిజంగానే గుడ్‌న్యూస్ కదూ..ఆ వివరాలు మీ కోసం..
రైల్వే ప్రయాణీకులకు ఇది కచ్చితంగా శుభవార్త. రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు కొత్త సౌకర్యం ప్రవేశపెట్టింది. ప్రయాణీకుల సౌకర్యార్ధం రైల్వే ఎప్పటికప్పుడు కొత్త కొత్త సౌకర్యాలు అందిస్తోంది. ఈసారి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది.
రైల్వే టికెట్ల విషయంలో కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. రైల్వే టికెట్ కేన్సిల్ ఇప్పుడు అత్యంత సులభంగా క్షణాల్లో చేయవచ్చు. రైల్వే యాప్ లేదా రైల్వే వెబ్‌సైట్‌లో లాగిన్ అయి సులభంగా టికెట్ రద్దు చేసుకోవచ్చు. మెయిల్ ద్వారా కూడా మీరు మీ రైలు టికెట్ కేన్సిల్ చేసుకునే అద్భుతమైన సౌకర్యాన్ని కల్పించింది రైల్వే శాఖ. అధికారికంగా ట్వీట్ ద్వారా ఈ సమాచారాన్ని షేర్ చేసింది. రైల్వే అధికారిక ట్విట్టర్ ఎక్కౌంట్‌పై ఓ ప్రయాణీకుడి ఫిర్యాదుకు రైల్వే శాఖ స్పందించింది. ఓ ప్రయాణీకుడు తత్కాల్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ ట్రైన్ రద్దవడంతో మరో యాత్రను ఎంచుకోవల్సి వచ్చింది. టికెట్ బుక్ చేయాల్సిన అగత్యం ఏర్పడిందని..కానీ టికెట్ రద్దు చేసుకున్నా సరే..రిఫండ్ రాలేదని ఆ ప్రయాణీకుడు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదుపై రైల్వే శాఖ ట్వీట్ ద్వారా సమాధానమిచ్చింది. ప్రయాణీకులు ఎవరైనా టికెట్ రద్దు చేసుకోలేకపోతే..రిజిస్టర్డ్ మెయిల్ ద్వారా etickets@irctc.co.inకు మెయిల్ చేసి టికెట్ రద్దు చేసుకోవచ్చని తెలిపింది. రైల్వే నిర్వహణ కారణాలతో రైలు ఒక్కోసారి రద్దు కావచ్చు. ఒకవేళ ఏదైనా కారణాలతో రైలు రద్దయితే..ఛార్ట్ ప్రిపేర్ అయినప్పుడు ఫైనల్ స్టేటస్ తెలుస్తుందని వెల్లడించింది. ఈలోగా రద్దు చేసుకుంటే కేన్సిలేషన్ ఛార్డిలు పడవని తెలిపింది.
Also read: OnePlus Smart TV : 40 అంగుళాల వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ కేవలం రూ.4599కే.. రూ.16500 తగ్గింపు..
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook