Aadhaar Centre: నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారం ఆధార్ కార్డే. అంతగా అవసరమైన ఆధార్ కార్డు అప్‌డేట్ విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందుకే ఇప్పుడు రైల్వే స్టేషన్లలో సైతం ఆధార్ సెంటర్లు వెలుస్తున్నాయి..
దైనందిన జీవితంలో అన్నింటికీ అవసరంగా మారిన ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ఇళ్లు మారినా లేదా ఫోన్ నెంబర్ మారినా అప్‌డేట్ తప్పదు. అయితే ఇటీవలి కాలంలో ఆధార్ సెంటర్లలో ఎక్కడ చూసినా బిజీ ఉంటోంది. పెద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. ఆధార్ అప్‌డేట్ కోసం స్లాట్ బుకింగ్‌కు కూడా నిరీక్షించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అప్‌డేట్ అత్యవసరమైతే..చాలా సమస్యే ఎదురౌతోంది.
అందుకే ఆధార్ అవసరాన్ని గుర్తించిన భారతీయ రైల్వే ఇప్పుడు రైల్వే స్టేషన్లలో సైతం ఆధార్ కేంద్రాలు నెలకొల్పుతోంది. తొలిసారిగా నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే గౌహతి రైల్వే స్టేషన్‌లో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రఫిక్ అప్‌డేట్ ఉచితం కాగా, బయటైతే బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రఫిక్ అప్‌డేట్‌కు మాత్రం 100 రూపాయలు చెల్లించాలి. ఆధార్ సెంటర్లో అప్‌డేట్ కోసం 50 రూపాయలు చెల్లిస్తే చాలు. ఇ ఆధార్ డౌన్‌లోడ్ చేసి ఏ4 కలర్ ఫ్రింట్‌కు 30 రూపాయలు చెల్లించాలి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 12న కొత్త ఛార్జీల్ని ప్రకటించింది.
త్వరలో మరికొన్ని రైల్వేస్టేషన్లలో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది భారతీయ రైల్వే. యూఐడీఏఐ ప్రకటించిన ఛార్జీల కంటే అదనంగా వసూలు చేస్తే..1947కు కాల్ చేసి లేదా help@uidai.gov.in మెయిల్ ద్వారా లేదా https://resident.uidai.gov.in/file-complaint వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
Also read: PM Awas Yojana: ప్రధానమంత్రి ఆవాస్ యోజన మరో రెండేళ్లు పొడిగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook