Old vs New Tax Regime: కేంద్ర ఆర్ధిక శాఖ రెండు రకాల ట్యాక్స్ విధానాల్ని అందుబాటులో ఉంచింది. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్, రెండవది న్యూ ట్యాక్స్ రెజీమ్. పాత ట్యాక్స్ రెజీమ్‌తో పోలిస్తే కొత్ ట్యాక్స్ విధానంలో ట్యాక్స్ రేట్లు, డిడక్షన్లు కూడా తక్కువే ఉంటాయి. ఈ రెండు విధానాల్లో ఏదో ఒక విధానాన్ని ఎంచుకోవచ్చు.
న్యూ ట్యాక్స్ రెజీమ్ కింద లోయర్ ట్యాక్స్ రేట్లు ఉండటంతో ట్యాక్స్ పేయర్లకు ట్యాక్స్ కూడా తక్కువే ఉంటుంది. అదే సమయంలో ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో ఉండే వివిధ రకాల డిడక్షన్లు, మినహాయింపులు ఇందులో ఉండవు. న్యూ ట్యాక్స్ రెజీమ్ లాభదాయకమా కాదా అనేది తెలుసుకోవాలంటే ట్యాక్స్ లెక్కలు వేసుకోవల్సిందే. ఆదాయం ఎంత, డిడక్షన్లు, మినహాయింపులు ఎంత పోతాయనేది లెక్కించుకోవాలి. తక్కువ ట్యాక్స్ ప్రయోజనాలు పొందాలంటే న్యూ ట్యాక్స్ రెజీమ్ ఉపయుక్తంగా ఉ్ంటుంది. ఉదాహరణకు ఏడాది ఆదాయం 7.5 లక్షల రూపాయులంటే న్యూ ట్యాక్స్ రెజీమ్ ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా 5 కోట్లకు పైగా ఆదాయం ఉన్నవారికి కూడా చాలా లాభదాయకం.
ప్రతి ట్యాక్స్ విధానంలోనూ డిడక్షన్లు, మినహాయింపుల్ని బేరీజు వేసుకోవాలి. పాత ట్యాక్స్ విదానంలో చాలారకాల మినహాయింపు, డిడక్షన్లు ఉంటాయి. కానీ కొత్త ట్యాక్స్ విధానంలో చాలా తక్కువ మినహాయింపులుంటాయి. ఉద్యోగస్థులకు హెచ్ఆర్ఏ, ట్రావెల్ అలవెన్స్, సెక్షన్ 80సి, సెక్షన్ 80డి ప్రకారం మినహాయింపులు, డిడక్షన్లు ఉంటాయి. ఉద్యోగస్థులు, ఎన్పీఎస్ ఇన్వెస్ట్మెంట్లో స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం వ్యాపారులైతే ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్ ఎంచుకోవల్సి ఉంటుంది. ఒకసారి కొత్త ట్యాక్స్ విధానం ఎంచుకున్నాక తిరిగి పాత విధానం ఎంచుకోడానికి ఉండదు.
2023-24 ఆర్ధిక సంవత్సరంలో న్యూ ట్యాక్స్ రెజీమ్ ప్రధాన విధానంగా ఉంటుంది. ట్యాక్స్ రిటర్న్స్ పైల్ చేయకపోతే ఆటోమేటిక్‌గా కొత్త ట్యాక్స్ విధానంలో మారిపోతుంది. అందుకే కొత్త ట్యాక్స్ విదానం ఎంచుకునే ముందు అన్ని లెక్కలు బేరీజు వేసుకుని చూసుకోవాలి.
Also read: Yamaha Aerox S: యమహా నుంచి స్మార్ట్ కీ ఆప్షన్, 150 సిసి ఇంజన్‌తో కొత్త స్కూటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook