PF Withdrawal Process: అర్జంట్‎గా డబ్బులు అవసరమా? అయితే ఆన్‎లైన్ ద్వారా పీఎఫ్ డబ్బులు ఇలా విత్ డ్రా చేసుకోండి

How to withdraw money from PF: ఉద్యోగులకు పీఎఫ్ అనేది చాలా కీలకమైంది. వారి భవిష్యత్ అవసరాలకు పీఎఫ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రావిడెంట్ఫండ్ పాక్షికంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అసలు పీఎఫ్ ఎలా విత్ డ్రా చేసుకోవాలి. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Bhoomi | Last Updated : Sep 18, 2024, 04:13 PM IST
PF Withdrawal Process: అర్జంట్‎గా డబ్బులు అవసరమా? అయితే ఆన్‎లైన్ ద్వారా పీఎఫ్ డబ్బులు ఇలా విత్ డ్రా చేసుకోండి

How to withdraw money from PF: ఉద్యోగ భవిష్య నిధి లేదా ప్రావిడెంట్ ఫండ్. ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం జీతంలో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునే ప్రక్రియను పీఎఫ్ అంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. పదవీ విరమణ తర్వాత ఈ మొత్తాన్ని ఉద్యోగులకు అందిస్తుంది. ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం ఉద్యోగులు ప్రతినెలా వారి వేతనంలో నుంచి 12 శాతం పీఎఫ్ లో జమ చేస్తుండాలి. ఉద్యోగి వాటా, ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీ వాటాను కలిపి పీఎఫ్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేస్తారు. పీఎఫ్ అకౌంట్లోకి మొత్తానికి వార్షిక ప్రాతిపదికన వడ్డీని లెక్కిస్తారు. 

అయితే ఈ పీఎఫ్ మొత్తాన్ని ఉద్యోగులు పదవీ విరణమ తర్వాత ఉపసంహరించుకోవచ్చు. అయితే కొన్ని సమయాల్లో అంటే అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ ను విత్ డ్రా చేసుకునేందుకు కేంద్రం అనుమతిస్తుంది. 2024-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పీఎఫ్ వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన ఈపీఎఫ్ఓ జానీ చేసిన సర్క్యులర్ ప్రకారం పాక్షిక విత్ డ్రా లిమిట్ ను 50వేల నుంచి లక్ష వరకు పెంచింది. 

- పిల్లల వివాహం

-వైద్య అవసరాలు

-ఇల్లు కొనడానికి

-గృహ రుణం చెల్లించేందుకు

-ఇంటిని పునరుద్ధరించడానికి

ఇలాంటి సమయాల్లో పీఎఫ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. 

Also Read : SBI Fixed Deposit Scheme: ఎస్బిఐ కస్టమర్లకు అలర్ట్..సెప్టెంబర్ 30లోగా ఈ పనిచేయకపోతే..ఈ బంపర్ ఆఫర్ మిస్ అవుతారు

పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకునే ప్రక్రియ ఇదే: 

- మీరు తప్పనిసరిగా యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN), సభ్యుని బ్యాంక్ ఖాతా నంబర్, ID ప్రూఫ్, క్యాన్సిల్ చెక్ ఉండాలి. 

- ఇప్పుడు మీరు UAN పోర్టల్‌కి వెళ్లి మీ UAN నంబర్ , పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. 

-ఇప్పుడు మీరు ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌పై OTP వస్తుంది.  ఈ OT, క్యాప్చాను ఎంటర్ చేయాలి. 

-ఇప్పుడు మీ ప్రొఫైల్ పేజీ ఓపెన్ అవుతుంది. వెబ్ పేజీ కుడి ఎగువ భాగంలో మీరు "ఆన్‌లైన్ సేవలు" ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు స్క్రోల్ డౌన్ ఎంపికల నుండి 'క్లెయిమ్'పై క్లిక్ చేయండి.

- మీరు EPFOకి లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేయడం ద్వారా సభ్యుల వివరాలను ధృవీకరించాలి.

- మీరు క్లెయిమ్ చేసిన మొత్తం EPFO ​​ద్వారా ఈ బ్యాంక్ ఖాతాకు క్రెడిట్ చేయబడుతుందని పేర్కొంటూ మీరు సర్టిఫికేట్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ని అందుకుంటారు. 

-ఇప్పుడు మీరు నిబంధనలు, షరతులకు 'అవును'పై క్లిక్ చేయాలి.

-ఇప్పుడు మీరు ఆన్‌లైన్ క్లెయిమ్ కోసం కొనసాగవచ్చు. మీరు ఈ ఎంపికపై క్లిక్ చేసిన వెంటనే, మీరు మరిన్ని వివరాలను నమోదు చేయవలసిన విభాగం ఒపెన్ అవుతుంది. 

-ఇక్కడ మీరు మీ అడ్రస్ నమోదు చేయాలి. స్కాన్ చేసిన చెక్, ఫారమ్ 15G వంటి కొన్ని పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలి.

-ఈ విధంగా, EPF ఖాతా యొక్క బ్యాలెన్స్‌ను విత్ డ్రా చేసుకునేందుకు  క్లెయిమ్ సమర్పిస్తుంది. 

Also Read : Business Ideas: ఏడాది పొడవునా డిమాండ్ తగ్గని బిజినెస్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. నెలకు లక్షల్లో ఆదాయం

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News