PF Withdraw: ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. పీఎఫ్ అకౌంట్లో ఉద్యోగి బేసిక్ సాలరీలో 12శాతం చందాగా చెల్లిస్తారు. మిగతా 12శాతం కంపెనీ యాజమాన్యం చెల్లిస్తుంది. అయితే చాలా కంపెనీల్లో డబుల్ పీఎఫ్ ఉద్యోగి జీతం నుంచే కట్ చేస్తుంటారు. చాలా ఏళ్లుగా పీఎఫ్ చందా చెల్లిస్తారు. అయితే ఆర్థికంగా అత్యవసరం ఉన్నవాళ్లు పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేయవచ్చు.దీనికి కంపెనీ అనుమతి కూడా అవసరం ఉండదు. మీ దగ్గర యూఏఎన్ నెంబర్ ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన వివరాలను అకౌంట్ అనుసంధించి ఉండాలి.
పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలనుకునేవారు ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ కు వెళ్లి..అక్కడి ఎంప్లాయిస్ అప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత UAN ఆన్ లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేయాలి. UAN నెంబర్ ఎంటర్ చేసి పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ కాగానే వ్యూ, మేనేజ్, అకౌంట్, అన్ లైన్ సర్వీస్ ఆప్షన్స్ ఉంటాయి.
ఆన్ లైన్ సర్వీస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆన్ లైన్ క్లెయిమ్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ పేరు, మీ తండ్రి పేరు, పుట్టినరోజు, ఫోన్ నెంబర్ ఆధార్, పాన్ నెంబర్, ఐఎఫ్ సీ నెంబర్ ఉంటుంది. మీరు ముందుగా ఏ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇస్తారో..అదే బ్యాంకు అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. ఫామ్ 10 సెలక్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టేట్ మెంట్, క్యాన్సల్ చెక్ అప్ లోడ్ చేసిన తర్వాత 7 వర్కింగ్ డేస్ నుంచి 10 వర్కింగ్ డేస్ లో డబ్బులు మీ అకౌంట్లో జమ అవుతాయి. ఒక వేళ మీ బ్యాంక్ ఖాతాతో అనుసంధానం అయి లేకుంటే మేనేజ్ లోకి వెళ్లాలి. కేవైసీపై క్లిక్ చేయాలి. అక్కడ బ్యాంక్ పై క్లిక్ చేయాలి. బ్యాంక్ ఖాతా నెంబర్ ఎంటర్ చేయాలి. మరోసారి కూడా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఐఎఫ్ సీ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీకు ఆధార్ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ సబ్‌మిట్ చేయాలి. అప్పుడు మీ యాజమాన్యం ఒకే చేయాలి. అప్పుడు మీ అకౌంట్ అను సంధానం అవుతుంది. అయితే అత్యవసరం ఉంటేనే డబ్బు డ్రా చేసుకుంటే మంచిది. ప్రస్తుతం పీఎఫ్ లో 8.25 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.