How To Block Your Mobile Number: టెక్నాలజీ ఎంత ముందుకువెళ్తున్నా, సైబర్ నేరాలు సైతం అదే మోతాదులో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో పలువురు తమ మొబైల్ నెంబర్లకు వచ్చే ఫోన్ కాల్స్, మెస్సేజ్‌ల ద్వారా లక్షల్లో నష్టపోయారు. అయితే మీ ఫోన్ నెంబర్ కొన్ని గ్రూప్‌లలో చేర్చినా, కొందరు సైబర్ నేరగాళ్లకు చేరినా ప్రమాదం పొంచి ఉన్నట్లే.
కొన్ని సందర్భాలలో అనుకోకుండా మన ఫోన్ నెంబర్ కొన్ని గ్రూప్‌లలో యాడ్ అవుతుంటాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని లింక్స్ పంపించి గేమ్ ఆడితే విలువైన బహుమతులు, ప్రైజ్‌మనీ గెలవొచ్చునంటూ సందేహాలు పంపుతారు. మరికొన్ని సందర్భాలలో తక్కువ రూపాయలకు ఎక్కువ విలువైన వస్తువులు, క్యాష్ ప్రైజ్ అంటూ కాల్స్ చేసి వ్యక్తిగత వివరాలు సేకరించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారు. కనుక మీ ఫోన్ నెంబర్‌ను కొన్ని కాలర్ ఐడీల నుంచి బ్లాక్ చేసుకుంటే మీ వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించిన వారవుతారు. తద్వారా మానసిక ప్రశాంతత సైతం పొందుతారు. ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ వినియోగదారులు తమ నెంబర్లను కింద తెలిపిన కొన్ని విధానాలలో బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది.
Also Read: Samsung Galaxy F22 Price In India: భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 విడుదల
1. *67 నెంబర్‌తో డయల్
మీరు ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే ముందుగా *67 టైప్ చేసి ఆ తరువాత కావాల్సిన వ్యక్తి నెంబర్ ఎంటర్ చేసి డయల్ చేయాలి. అలా చేసిన పక్షంలో మీ కాలర్ ఐడీ అవతలి వ్యక్తికి కనిపించదు. ఇలా చేస్తే నో కాలర్ ఐడీ, ప్రైవేట్, బ్లాక్‌డ్ లాంటి మెస్సేజ్ వారి మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ముందుగా మీరు కోరుకున్న వ్యక్తి ఫోన్ నెంబర్‌ను క్లిప్‌బోర్డ్ మీకు కాపీ చేసుకోవాలి. ఆపై నెంబర్‌కు ముందుగా *67 చేర్చి డయల్ చేయాలి. ఉదాహరణకు 333 333 3333 నెంబర్‌కు కాల్ చేయాలంటే *67 333 333 3333 నెంబర్ మొత్తం ఎంటర్ చేసి కాల్ చేస్తే మీ కాలర్ ఐడీ సురక్షితంగా ఉంటుందని సైబర్ నిపుణులు సూచించారు.
2. కాలర్ ఐడీ సెట్టింగ్స్ మార్చడం
మీ ఫోన్ నెంబర్‌ను కాలర్ ఐడీలో బ్లాక్ చేయాలని మీరు భావిస్తున్నారా, అయితే మీ మొబైల్ డివైజ్ సెట్టింగ్స్ మార్చాలి. కాలర్ ఐడీ హైడ్ చేయడం, ప్రైవేట్ లేదా బ్లాక్‌డ్ అని వచ్చేలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో పాటు ఐఫోన్ యూజర్లకు సైతం మొబైల్‌లో సెట్టింగ్స్ ద్వారా సాధ్యమవుతుంది. ఒకవేళ మీ పోన్ నెంబర్‌ను తాత్కాలికంగా అన్‌బ్లాక్ చేయాలనుకుంటే మీరు డయల్ చేసే నెంబర్‌కు ముందు *82ను జత చేయాల్సి ఉంటుంది.
Also Read: LPG Cylinder Price: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు, ఆయా నగరాలలో లేటెస్ట్ ధరలు ఇలా
3. నేరుగా మీ కాలర్ ఐడీ బ్లాక్ చేయడం
ఒకవేళ మీ మొబైల్ ద్వారా కాలర్ ఐడీ బ్లాక్ చేయడం వీలుకాని పక్షంలో సెల్ కారియర్ సంస్థకు కాల్ చేసి సర్వీస్ కోరాలి. మొబైల్ సంస్థలు కనుక మీ నెంబర్ కాలర్ ఐడీని బ్లాక్ చేయడం వీలుకాదని చెప్పిన పక్షంలో మీరు ఆ సంస్థ యాప్ ద్వారా బ్లాక్ చేసే వీలుంది. అందుకోసం ముందుగా మొబైల్ సిమ్ కంపెనీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆపై సెట్టింగ్స్‌లో కాలర్ ఐడీని హైడ్ లేదా బ్లాక్ చేసుకుంటే సరిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook