Honda Activa H Smart: మార్కెట్‌లోకి Honda Activa H Smart..అప్డేట్ మోడల్‌తో అందరినీ ఆకర్షిస్తోంది..

Honda Activa H Smart: ప్రస్తుతం మార్కెట్లోకి హోండా మరో స్కూటీని విడుదల చేయబోతోంది. Activa H-Smart వెర్షన్ స్కూటీని ఈనెల 23న భారత మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది హోండా. ఈ స్కూటీకి సంబంధించిన ఫీచర్లు ఈ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2023, 01:10 PM IST
Honda Activa H Smart: మార్కెట్‌లోకి Honda Activa H Smart..అప్డేట్ మోడల్‌తో అందరినీ ఆకర్షిస్తోంది..

Honda Activa H Smart: హోండా మోటార్‌సైకిల్ మార్కెట్లోకి మరో స్కూటర్ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా తెలియజేసింది. ఈ కొత్త మోడల్ కు సంబంధించిన బైక్ ను జనవరి ని 23న లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.. యాక్టివా హెచ్-స్మార్ట్ పేరుతో స్కూటర్‌ను తీసుకువస్తున్నట్లు హోండా పేర్కొంది. హోండా యాక్టివా 5జి ని అప్డేట్ మోడల్ తో వినియోగదారులకు ఈ స్కూటీని అందించబోతున్నట్లు సమాచారం. మార్కెట్లో హోండాకు ఉన్న పేరు ఎంతో కాదు. ఈ కంపెనీ బైకుల న్నీ మంచి మైలేజీతో కూడిన మన్నిక గల పరికరాలతో తయారు చేయబడతాయి. అందుకే వినియోగదారులు వీటిని కొనేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు.

ఈ స్కూటీ టాప్ ఎండ్ వెర్షన్తో పాటు హెచ్-స్మార్ట్ టెక్నాలజీతో మార్కెట్లోకి రాబోతోంది. యాంటీ-థెఫ్ట్ సిస్టమ్‌తో సహా అనేక కొత్త ఫీచర్లను మీరు ఈ స్కూటీలో చూడవచ్చు. మార్కెట్లో ఈ స్కూటీ టీవీఎస్ జూపిటర్, హీరో మాస్ట్రో స్కూటర్‌లతో పోటీకి దిగనుంది. హోండా యాక్టివా హెచ్-స్మార్ట్  స్కూటీ శక్తివంతమైన ఇంజన్ తో పాటు.. చాలా రకాలు ఫీచర్లతో రేపు మార్కెట్లోకి రాబోతోంది. ఈ స్కూటీ బరువు విషయానికొస్తే..DLX వేరియంట్ కంటే దాదాపు 1KG తక్కువగా ఉంటుంది. కొత్త Activa H-Smartని గ్రాఫిక్స్ పాటు చాలా కలర్ ఆప్షన్‌లతో హోండా తీసుకురాబోతోంది.110cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ 7.80 bhp శక్తిని ఉత్పత్తి చేయనుంది. 

H-Smart టెక్నాలజీలో కంపెనీ యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ ని అమర్చింది. అంతే కాకుండా ప్రీమియం బైకులపై హోండా ఇగ్నిషన్ సెక్యూరిటీ సిస్టమ్ (HISS)ని అందిస్తోంది. అందుకే హోండా యాక్టివాకు సంబంధించిన మోడల్స్ అత్యంత ప్రజాధారణ పొందాయి. మార్కెట్లో విడుదలైన యాక్టివా 6జి ఊహించని స్థాయిలో విక్రయించబడింది. 

కొత్త ఫీచర్ల కారణంగా.. Activa H-Smart వెర్షన్ ధర కూడా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ప్రస్తుత తరం Activa 6G ధర రూ.73,360 నుంచి రూ.75,860 వరకు విక్రయిస్తోంది. కొత్త మోడల్ ధర సుమారుగా రూ. 75,000 నుంచి రూ. 80,000 మధ్య ఉండవచ్చని అంచనా. దీనికి సంబంధించిన సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

Also read: Share Market: షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ఎలా గుర్తించాలి, 7 సులభమైన టిప్స్

Also read: Share Market: షేర్ మార్కెట్‌లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను ఎలా గుర్తించాలి, 7 సులభమైన టిప్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News