Hindenburg Research : స్టాక్ మార్కెట్లో హిండెన్ బర్గ్ రీసెర్చ్ పేరు వినగానే అందరికీ వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆయన చేసే ట్వీట్లు స్టాక్ మార్కెట్లను కుప్పకూలుస్తాయి. గతంలో ఈ సంస్థ అదానీ గ్రూపు పై చేసిన ఆరోపణల ఫలితంగా స్టాక్ మార్కెట్లలో భారీగా సెల్లింగ్ జరిగింది. దీంతో అదానీ కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇప్పుడు తాజాగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ పేరిట ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ Something big soon India అంటూ ట్వీట్ చేసింది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది.
ఈ సారి ఎవరిని ఇండియన్ బర్కి టార్గెట్ చేశారా అని ప్రతి చోట చర్చలు సాగుతున్నాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లలో లోపాలను గుర్తించి ఆయా కంపెనీలను ఎక్స్ పోజ్ చేస్తుంది. తద్వారా మార్కెట్లను భారీ సెల్లింగ్ గురిచేస్తుంది. తద్వారా స్టాక్ మార్కెట్లను కరెక్షన్ గురవుతాయి. సాధారణంగా షార్ట్ సెల్లింగ్ చేసే వారికి హిండెన్బర్గ్ చేసే ట్వీట్లు చాలా ఉపయోగపడతాయి అయితే ఈ సారి ఆయన భారత స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ట్వీట్ చేయనున్నారా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.
ఎందుకంటే గతంలో హిండెన్బర్గ్ సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు అని చెప్పవచ్చు. అదానీ గ్రూపు షేర్లు సగానికి సగం పడిపోవడానికి వీరు విడుదల చేసిన లీకులే ప్రధాన కారణంగా చెబుతుంటారు. దీనిపై అటు సెబీ కూడా విచారణకు ఆదేశించింది. 2017 లో హింటెన్బర్గ్ రీసెర్చ్ సంస్థను నాథన్ అండర్సన్ అనే వ్యక్తి దీన్ని స్థాపించారు. కార్పొరేట్ ప్రపంచంలో జరిగే మోసాలను అదే విధంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ను వీరు ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటారు. తద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తుంటారు.
ముఖ్యంగా కంపెనీలు చేసే అవకతవకలను బయట పెట్టడంలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. 2020 సంవత్సరంలో నికోలా కార్పొరేషన్ కు సంబంధించిన పలు ఆరోపణల కారణంగా నికోలా స్టాక్ దాదాపు 40 శాతం వరకు నష్టపోయింది. సదరు కార్పొరేషన్ మోసపూరిత చర్యలను రిపోర్ట్ ద్వారా బయటపెట్టారు. ఫలితంగా డ్రైవర్ మిల్టన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
ఇక భారతదేశంలో అదానీ గ్రూపు సంబంధించి అకౌంటింగ్ లోపాలను బయట పెట్టడంతో అదా నీ గ్రూప్ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. గ్రూపు చైర్మన్ అదానీ ఒక్కరోజే ప్రపంచంలోని మూడవ అత్యంత ధనవంతుడి స్థానం నుంచి 30వ స్థానానికి పడిపోయారు. 2023లో కూడా ఇకాన్ ఎంటర్ప్రైజెస్ రిపోర్ట్ కూడా సంచలనంగా మారింది. సదరు కంపెనీ పొంజీ స్కీమ్ నడుపుతోందని దుయ్యబట్టారు. దీంతో ఈ స్టాక్ కూడా దాదాపు 50 శాతం నష్టపోయింది.
Also Read: Mutual Funds : నెలకు రూ. 1000 ఇన్వెస్ట్ చేస్తే చాలు 35 లక్షలు మీ సొంతం.. ఎలాగో తెలుసుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి