Hero Maverick 440 vs Royal Enfield Classic 350: వీటిల్లో బెస్ట్‌ బైక్‌ ఇదే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, ఇంజన్‌ అదిరిపోయింది!

Hero Maverick 440 vs Royal Enfield Classic 350: హీరో నుంచి మార్కెట్‌లోకి మరో ప్రీమియం ఫీచర్స్‌తో కూడా బైక్‌ విడుదలైంది. అయితే ఇది ప్రముఖ ఆటో కంపెనీకి చెందిన Royal Enfield విడుదల చేసిన Classic 350తో పోటీ పడబోతోంది. వీటి రెండింటిలో ఏది బెస్ట్‌ బైకో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2024, 03:08 PM IST
Hero Maverick 440 vs Royal Enfield Classic 350: వీటిల్లో బెస్ట్‌ బైక్‌ ఇదే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, ఇంజన్‌ అదిరిపోయింది!

 

Hero Maverick 440 vs Royal Enfield Classic 350: ప్రముఖ కంపెనీ హీరో తమ అతి శక్తివంతమైన ఫీచర్స్‌ కలిగన  బైక్ Mavrick 440ని విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ బైక్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే హీరో ఈ మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన ప్రి బుకింగ్స్‌ను కూడా వెల్లడించింది. వచ్చే నెలలోని రెండవ వారంలో ప్రి బుకింగ్‌ను ప్రారంభించి ఏప్రిల్‌ మొదటి వారంలో డెలివరీ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటి కంపెనీ ఈ బైక్‌కి సంబంధించిన ధరను కూడా అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. ఈ బైక్‌ 400 సిసి ఇంజన్‌తో భారత్‌లో ఎంతో ఫేమ్‌ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి గట్టి పోటీని ఇవ్వబోతుందని మార్కెట్‌లో సమాచారం. అయితే చాలా మంది ఈ రెండు బైక్స్‌లో దేనిని కొనుగోలు చేయాలని తికమక పడుతున్నారు. మీరు కూడా ఇలా తికమక చెందుతున్నరా? అయితే ఈ రెండింటిలో ఏ బైక్‌ బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

హీరో మావ్రిక్ 440 vs రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350
ఇంజన్: 

ఇంజన్ స్పెషిఫికేషన్స్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే..హీరో మావెరిక్ 440 440cc లాంగ్-స్ట్రోక్ ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో మార్కెట్‌లోకి రాబోతోంది. దీని ఇంజన్‌  27 bhp పవర్ అవుట్‌పుట్‌తో పాటు 36 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని ఆటో నిపుణులు తెలుపుతున్నారు. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 విషయానికొస్తే ఇది 349సీసీ ఇంజన్‌తో పాటు ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ వంటి ఫీచర్స్‌తో లభిస్తోంది. అయితే దీని ఇంజన్‌ 20 బిహెచ్‌పి పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుందని సమాచారం. దీంతో పాటు ఇది 27 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ట్యూన్‌ను కలిగి ఉంటుంది.

హార్డ్వేర్ పూర్తి వివరాలు:
ఇక ఈ రెండు బైక్‌లకు సంబంధించిన హార్డ్‌వేర్ విషయానికొస్తే..మావ్రిక్ 440 మోటర్‌ సైకిల్‌ 43 మిమీ ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్కులతో రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక బ్యాక్‌ సెటప్‌లో డ్యూయల్ షాకర్స్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్‌తో రాబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వివరాల్లోకి వెళితే, ఫ్రంట్‌ సెటప్‌లో 130 మిమీ ట్రావెల్‌తో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు బ్యాక్‌ సెట్‌లో 6 స్టెప్ ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్‌తో కూడిన ట్విన్ షాక్ సస్పెన్షన్‌తో అందుబాటులో ఉంది. ఇది  సింగిల్-ఛానల్ ABS వెర్షన్‌లో 300mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను మాత్రమే అందిస్తోంది. అలాగే ఇంకో చక్రానికి 153mm డ్రమ్ బ్రేక్ 270mm డిస్క్‌ను కలిగి ఉంటుంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

ధర:
హీరో కంపెనీ Maverick 440కి సంబంధించిన ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీని ధర అంచనాల ప్రకారం సుమారు రూ. 2 లక్షల (ఎక్స్-షోరూమ్)తో విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది. ఇక Royal Enfield Classic 350 మోటర్‌ సైకిల్ విషయానికొస్తే..భారతదేశంలో రూ. 1.93 లక్షల నుంచి రూ. 2.25 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) మార్కెట్‌లో అందుబాలటులో ఉంది. 

ఏది బెస్ట్‌ బైక్‌?
ఆటో నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండింటిలో పవర్, ఇంజన్‌ పరంగా చూస్తే హీరో మావెరిక్ 440 కొంచెం మెరుగైన ఇంజన్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక మైలేజీ, ఇతర ఫీచర్స్‌ పరంగా చూసిన ఈ బైకే ముందుంటుంది. అయితే ధర పరంగా చూసేవారు తప్పకుండా క్లాసిక్ 350ని కొనుగోలు చేయోచ్చు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News