Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

Hero Sold More Than 3.5 Lakhs Bikes and Scooters in January 2023. భారతదేశంలో ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్.. 2023 జనవరిలో 3,56,690 యూనిట్లను విక్రయించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 3, 2023, 08:42 PM IST
  • హీరో ముందు అన్ని 'జీరో'లే
  • 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి
  • హోండా అమ్మకాల్లో 16 శాతం క్షీణత
Hero Bike-Scooters Sales 2023: హీరో ముందు అన్ని 'జీరో'లే.. 3.5 లక్షల బైక్-స్కూటర్లు అమ్ముడయ్యాయి!

Hero MotoCorp sold 356690 Scooters and Bikes in January 2023: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్'. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహన కంపెనీగా హీరో మోటోకార్ప్ కొనసాగుతోంది. 2023 జనవరిలో 3,56,690 యూనిట్లను హీరో విక్రయించింది. ఇందులో దేశీయంగా 3,49,437 యూనిట్లు విక్రయించగా.. 7,253 యూనిట్లును ఎగుమతి చేసింది. జనవరి నెలలో 23,052 స్కూటర్లు మరియు 3,33,638 మోటార్ సైకిళ్లను హీరో మోటోకార్ప్ విక్రయించింది.

2023 జనవరిలో హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లు రెండింటి మొత్తం అమ్మకాలు 3,56,690 యూనిట్లు. ఇది జనవరి 2022లో విక్రయించబడిన యూనిట్ల కంటే 6.25 శాతం తక్కువ. 2022 జనవరిలో హీరో మోటోకార్ప్ 3,80,476 యూనిట్లను విక్రయించింది. ఈ నెలాఖరులో వివాహాల సీజన్‌ మొదలవడం, పండగలు కూడా ఉండడంతో.. డిమాండ్ పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. 2023 జనవరిలో స్కూటర్ విక్రయాలు 1.86 శాతం పెరిగాయి. మరోవైపు మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో మాత్రం తగ్గుదల ఉంది.

హీరో మోటోకార్ప్ మోటార్‌సైకిల్ విక్రయాలు జనవరి 2022లో 3,57,845 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి 2023లో 6.76 శాతం క్షీణించి 3,33,638 యూనిట్లకు పడిపోయింది. మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో కంపెనీ స్ప్లెండర్, ప్యాషన్, హెచ్‌ఎఫ్ డీలక్స్ వంటి బైక్‌లను విక్రయిస్తోంది. మరోవైపు స్కూటర్ అమ్మకాలు జనవరి 2022లో 22,631 యూనిట్లుగా ఉన్నాయి. 2023 జనవరిలో 1.86 శాతం పెరిగి 23,052 యూనిట్లకు పెరిగాయి. డెస్టినీ, మాస్ట్రో, ప్లెజర్ వంటి స్కూటర్లను హీరో విక్రయిస్తుంది.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) జనవరి 2023లో 2,96,363 ద్విచక్ర వాహనాలను (స్కూటర్, బైక్) విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో 16 శాతం క్షీణత ఉంది. దేశీయ మార్కెట్‌లో కంపెనీ 2,78,143 యూనిట్లను విక్రయించగా.. 18,220 యూనిట్లను ఎగుమతి చేసింది. గత ఏడాది ఇదే నెలలో (జనవరి 2022) కంపెనీ 3,54,209 యూనిట్లను విక్రయించింది.

Also Read: Jasprit Bumrah Comeback: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో జస్ప్రీత్‌ బుమ్రా!  

Aslo Read: Joginder Sharma Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 2007 టీ20 ప్రపంచకప్‌ హీరో!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News