Google New Feature: ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ త్వరలో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. యూజర్ల వ్యక్తిగత భద్రతలో భాగంగా..సైబర్ దాడులు, హ్యాకర్ల నుంచి రక్షించేందుకు ఈ ఫీచర్ అందుబాటులో తీసుకురానుంది.
ఈ కొత్త ఫీచర్ యూజర్ల డేటాను హ్యాకర్ల నుంచి కాపాడేందుకు దోహదపడుతుంది. ఈ ఫీచర్ ద్వారా ఇప్పటికే జీ మెయిల్, గూగుల్ డ్రైవ్ సేవల్లో వార్నింగ్ బ్యానర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫీచర్ త్వరలో గూగుల్ చాట్‌లో కూడా రానుంది. 1-2 వారాల్లోనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది గూగుల్. గూగుల్ డ్రైవ్‌బుక్‌లో ఈ ఫీచర్ డీఫాల్ట్‌గా ఉంటుంది. యాప్‌లో డేంజర్ డేటా, అనుమానాస్పద డాక్యుమెంట్ లేదా ఫోటోను ఓపెన్ చేయగానే క్షణాల్లో స్కాన్ చేసి వినియోగదారుల్ని అలర్ట్ చేస్తుంది.
మరోవైపు డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022లో భాగంగా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ రెండవ బీటాను విడుదలైంది. ఇది ప్రైవసీ, సెక్యూరిటీకు సంబంధించి తాజా అప్‌డేట్‌తో పాటు కొత్త ఫీచర్ ఇవ్వనుంది. క్రోమ్ అడ్వాన్స్‌డ్ స్క్రీన్ షాట్ టూల్‌ను విండోస్11, విండోస్ 10, మ్యాక్స్ ఓఎస్, క్రోమ్ ఓఎస్ యూజర్ల కోసం ప్రవేశపెట్టనుంది. దీని సహాయంతో వెబ్ పేజీల్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడం సాధ్యమవుతుంది. సర్కిల్స్, స్క్వేర్స్, లైన్స్ ఇలా వివిధ షేపుల్ని వెబ్‌సైట్ పేజీ స్క్రీన్ షాట్‌పై పేస్ట్ చేయవచ్చు. గూగుల్ కొత్త ఫీచర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌లో ఉండే వెబ్ క్యాప్చర్ టూల్ లానే పనిచేస్తుంది. అయితే ఇందులో ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. త్వరలోనే ఇది అందుబాటులో రానుంది.
Also read: iPhone 14 New Feature: యాపిల్ కొత్త మోడల్ ఐఫోన్ 14లో సరికొత్త ఫీచర్, ఫ్రంట్ ఫేసింగ్ ఆటోఫోకస్ కెమేరా ఏర్పాటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Google New Feature: గూగుల్ నుంచి సరికొత్త ఫీచర్, హ్యాకర్ల నుంచి రక్షణ