Gold Price Today 20th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అసలే కరోనా కాలం కావడంతో బంగారం కొనుగోలు చేయాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇటీవల రూ.51 వేల మార్క్ చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు క్రమక్రమంగా పుంజుకుంటున్నాయి. వెండి ధర రూ.71 వేల మార్క్ చేరినా ధరలు ఇంకా ఆకాశాన్నంటేలా కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.450 మేర పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.51,060 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.410 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.46,810కి ఎగసింది.
Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Price Today) మరోసారి పుంజుకున్నాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.450 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.53,410కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.200 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,970కి చేరింది.
Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?
గత నెలలో భారీగా తగ్గిన వెండి ధరలు బులియన్ మార్కెట్‌లో డిసెంబర్‌లో పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ (Delhi) మార్కెట్‌లో వరుసగా నాలుగో రోజు వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. తాజాగా రూ.900 మేర పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.72 వేల మార్క్ చేరువలో ఉంది. తాజాగా రూ.1,000 మేర పెరిగింది. దీంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.71,600 అయింది.
Also Read: Air India 50 Percent Discount: ఎయిరిండియా శుభవార్త.. వారి టికెట్లపై 50శాతం డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook