Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలివే..

Gold Price Today June 28th 2022 : బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 1 గ్రా. బంగారం ధర రూ.4765గా ఉంది. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.5198గా ఉంది. 

Last Updated : Jun 28, 2022, 08:01 AM IST
  • తగ్గినట్లే తగ్గి పెరిగిన బంగారం ధరలు
  • 22 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.100 మేర పెరిగిన ధర
  • 24 క్యారెట్ల 10గ్రా. బంగారంపై రూ.110 మేర పెరిగిన ధర
  • దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలివే..

Gold Price Today June 24th 2022 : బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గడిచిన 10 రోజుల్లో నాలుగుసార్లు పెరిగిన బంగారం ధర నాలుగుసార్లు తగ్గింది. స్వల్ప పెరుగుదల, తగ్గుదల నమోదవుతూ వస్తోంది. మంగళవారం (జూన్ 28) బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 మేర ధర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 నుంచి రూ.47,4650కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 నుంచి రూ.51,870కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..: 

హైదరాబాద్‌లో సోమవారం (జూన్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా.. ఇవాళ (జూన్ 28) అది రూ.47,650కి చేరింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర  రూ.51,870 ఉండగా...  ఇవాళ రూ.51,980కి చేరింది.

ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24  క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.51,980గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,030గా ఉంది. 

కోల్‌కతా, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.. రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది.

పుణే, వడోదరా నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,030గా ఉంది. 

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650  ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980గా ఉంది. 

దేశంలోని మిగతా నగరాల్లోనూ ఇంచుమించుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా ఆయా నగరాల్లోని బంగారం ధరల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, తదితర అంశాలు బంగారం ధరలపై ఎప్పటికప్పుడు ప్రభావం చూపుతాయి.

(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ధరలు వివిధ మూలాల నుంచి సేకరించబడినవి. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా జ్యువెలరీ వ్యాపారితో సంప్రదించి ధరలను నిర్ధారించుకోండి.)

Also Read: Maharashtra Political Crisis: రెండుసార్లు రాజీనామాకు సిద్ధపడి వెనక్కి తగ్గిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఆయన వల్లే..

Also Read: Horoscope Today June 28th: నేటి రాశి ఫలాలు.. ఇవాళ ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News