Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే!

Today Gold Rate 29 December 2022, Gold Price increased on 29th December 2022: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,710గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 29, 2022, 06:58 AM IST
  • బంగారం ప్రియులకు షాక్
  • పెరిగిన పసిడి ధరలు
  • తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే!

Gold Price increased and Silver Rate stable on 29th December 2022: బంగారం ప్రియుల సంతోషం ఒకే ఒక్క రోజుకే పరిమితం అయింది. వరుసగా పెరుగుతూ వస్తోన్న పసిడి ధరలు నిన్న స్థిరంగా ఉండగా.. నేడు మళ్లీ పెరిగాయి. గురువారం (డిసెంబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 50,150లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,710లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 200.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 230 పెరిగింది. ఈ ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,860గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 50,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,710గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,050గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,690 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,200లుగా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,760గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,710గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,710గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,150.. 24 క్యారెట్ల ధర రూ. 54,710గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 50,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,710 వద్ద కొనసాగుతోంది. 

నేడు బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. గురువారం (డిసెంబర్ 29) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 72,300లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఎలాంటి మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 72,300లుగా ఉండగా.. చెన్నైలో రూ. 74,600లుగా ఉంది. బెంగళూరులో రూ. 74,600గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 74,600లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 74,600ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: ఆ సుగుణాలు ఉన్న మహిళ అయితే ఓకే.. జీవిత భాగస్వామిపై రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!  

Also Read: Nandamuri Balakrishna-Ram Charan : సంక్రాంతికి ముందు నా సినిమా చూడు.. రామ్ చరణ్‌ను బెదిరించిన బాలయ్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News