Blaupunkt tv: అద్భుతమైన ఫీచర్లు తక్కువ ధరకే బ్లాపంక్ట్ టీవీలు, హోమ్ థియేటర్ తలపించే టీవీలు కేవలం 11 వేలకే

Blaupunkt tv: ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మార్ట్‌టీవీ క్రేజ్ కన్పిస్తోంది. మేడిన్ ఇండియా కంటే చైనా, జపాన్, అమెరికా, తైవాన్, జర్మనీ దేశ ఉత్పత్తులే మార్కెట్‌లో ఎక్కువగా కన్పిస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లు ఉండి తక్కువ ధరకు లభ్యమయ్యే టీవీలు మార్కెట్ ఆక్రమిస్తున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2023, 09:42 PM IST
Blaupunkt tv: అద్భుతమైన ఫీచర్లు తక్కువ ధరకే బ్లాపంక్ట్ టీవీలు, హోమ్ థియేటర్ తలపించే టీవీలు కేవలం 11 వేలకే

Blaupunkt tv: ఛీఫ్ అండ్ బెస్ట్ స్మార్ట్‌టీవీల్లో భారతీయ మార్కెట్‌లో అధిక వాటా ఆక్రమించిన టీవీలు ఎంఐ, వీయూ తరువాత ఆ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు జర్మనీకు చెందిన బ్లాపంక్ట్ ప్రయత్నిస్తోంది. ఆండ్రాయిడ్ ఆధారిత ఛీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌టీవీల్లో ఇదొకటి. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ కంపెనీ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ లాంచ్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

జర్మనీకు చెందిన బ్లాపంక్ట్ టీవీ ఇండియన్ టీవీ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఈ టీవీ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఎవరూ ఊహించని విధంగా 75 శాతం డిస్కౌంట్ ఉంటుందని బ్లాపంక్ట్ కంపెనీ వెల్లడించింది. ఈ సిరీస్‌లో 32 ఇంచెస్ హెచ్‌డి, 43 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి, 40 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి, 65,50 ఇంచెస్ 4కే జీటీవీ, 75 క్యూఎల్ఈడీ వంటి మోడల్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా జూన్ 9 నుంచి జూన్ 14 మధ్యలో 75 శాతం డిస్కౌంట్‌తో బ్లాపంక్ట్ స్మార్ట్‌టీవీ విక్రయాలు జరగనున్నాయి.

బ్లాపంక్ట్ స్మార్ట్‌టీవీ ధర, ప్రత్యేకతలు

బ్లాపంక్ట్ స్మార్ట్‌టీవీ ధర చాలా తక్కువ. ఇందులో 32 ఇంచెస్ స్మార్ట్‌టీవీ 10,888 రూపాయలు కాగా, 40 ఇంచెస్ స్మార్ట్‌టీవీ ధర 16,499 రూపాయలుంటుంది. ఇక 43 ఇంచెస్ స్మార్ట్‌టీవీ ధర 18,499 రూపాయలుగా ఉంది. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, డిస్‌ప్లే ఈ టీవీ సొంతం. నెట్‌ఫ్లిక్స్ ఇన్ బిల్ట్‌తో పాటు ఈ మోడల్‌లో 248 వాట్స్ బాక్స్ స్పీకర్స్ ఉన్నాయి. 1 జీబీ ర్యామ్, 8 జీబీ రోమ్‌తో ఈ టీవీ అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దాంతోపాటు 3 హెచ్ డీఎమ్ఐలు, 2 యూఎస్‌బి పోర్ట్‌లు ఉండటం మరో ప్రత్యేకత. ఫలితంగా ల్యాప్‌టాప్, మొబైల్ డివైస్ , పీసీతో కనెక్టివిటీ సాధ్యమౌతుంది. అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలివ్, వూట్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రఖ్యాత ఓటీటీలు పనిచేస్తాయి. 

ఇక బ్లాంపక్ట్ 50 ఇంచెస్ గూగుల్ టీవీ మోడల్ ధర 28,999 రూపాయలుంటుంది. ఇందులోనే 65 ఇంచెస్ టీవీ ధర 44,444 రూపాయలుగా ఉంది. ఇవి 2 జీబీ ర్యామ్, 16 జీబీ రోమ్‌తో పనిచేస్తాయి. ప్రోసెసింగ్, స్టోరేజ్ కూడా ఎక్కువే. హెచ్ డీఆర్ 10 ప్లస్‌తో పాటు 4కే డిస్‌ప్లే కారణంగా అటు విజ్యువల్, ఇటు సౌండ్ రెండూ అత్యద్భుతంగ హోమ్ థియేటర్‌ను తలపిస్తాయి. డీటీఎస్ ట్రూ సరౌండ్ టెక్నాలజీతో 60 వాట్స్ డాల్బీ ఆడియో స్టీరియో బాక్స్ స్పీకర్లు 2 ఉంటాయి. వీటికి తోడు ఎయిర్‌స్లిమ్ డిజైన్, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజ్డ్ రిమోట్ వంటివి అదనపు ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు 

ఇక ఇదే సిరీస్‌లో మరో అద్భుతమైన టీవీ బ్లాపంక్ట్ 75 ఇంచెస్ క్యూలెడ్ టీవీ. ఈ టీవీ ధర 99,999 రూపాయలుంది. క్యూలెడ్ 4కే డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఇందులో అయితే 60 వాట్స్ ఇన్‌బిల్ట్ స్పీకర్లు 4 ఉంటాయి. ఈ రెండు టీవీలు హోమ్ థియేటర్ వాతావరణాన్ని కల్పిస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎంఐ, వీయూలతో పాటు టీసీఎల్, సోనీ, శాంసంగ్, ఎల్‌జి స్మార్ట్‌టీవీలతో పోలిస్తే బ్లాపంక్ట్ స్మార్ట్‌టీవీలు అంతకంటే అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండటమే కాకుండా చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. 

Also read: Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ వచ్చేసింది.. మహింద్రా థార్ కంటే తక్కువ ధరలో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News