Petrol Pump Frauds: దేశంలోని అనేక పెట్రోల్ స్టేషన్లలో చీటింగ్.. ఆ మోసాలను పసిగట్టండిలా!

Petrol Pump Frauds: ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎప్పడూ లేని విధంగా దేశంలో ఇంధన ధరలు పెరిగిపోయాయి. వీటికి తోడు అనేక పెట్రోల్ పంప్ లలో జరిగే మోసాల ద్వారా సామాన్యులపై మరింత భారం పడుతుంది. కానీ, పెట్రోల్ స్టేషన్లలో జరిగే మోసాలను పసిగట్టేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 04:23 PM IST
Petrol Pump Frauds: దేశంలోని అనేక పెట్రోల్ స్టేషన్లలో చీటింగ్.. ఆ మోసాలను పసిగట్టండిలా!

Petrol Pump Frauds: దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని పెట్రోల్ బంకుల్లో కస్టమర్లు మోసాలకు గురవుతున్నారు. పెట్రోల్ ధరలు పెరగడం సహా పెట్రోల్ స్టేషన్ యజమానులు చేసే మోసాల వల్ల సామాన్యులు మరికొంత నష్టపోతున్నారు. 

కానీ, ఆ మోసాలను పసిగట్టే ఉపాయాలు చాలానే ఉన్నాయి. దీని కోసం మీరు కొన్ని విషయాలపై మాత్రమే శ్రద్ధ వహించడం సహా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పెట్రోల్ లేదా డీజిల్ లను వాహనాలకు కొట్టించే సమయంలో మోసపోకుండా ఎలా ఉండాలో తెలుసుకోండి.

పెట్రోల్ పంప్ ల వద్ద జరిగే మోసాలను పసిగట్టండిలా..

1) సమాజంలో అనేక మంది ప్రజలు పెట్రోల్ పంప్‌ వద్దకు వెళ్లి రూ.100, 200, 500 రౌండ్ ఫిగర్‌లలో ఇంధనం నింపమని చెప్తారు. చాలా సార్లు పెట్రోల్ పంపు యజమానులు మెషీన్‌లో రౌండ్ ఫిగర్‌ను ఫిక్స్‌గా ఉంచుతారు. దాని వల్ల కస్టమర్ మోసానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే రౌండ్ ఫిగర్‌లో పెట్రోల్ నింపకుండా ఉండటం ముఖ్యం. దానికి భిన్నంగా అంటే రూ.10 నుంచి రూ.20 ఎక్కువ పెట్టి పెట్రోల్ నింపుకోవడం వల్ల మోసాన్ని నివారించవచ్చు.

2) బైక్ లేదా కారు ఖాళీ ట్యాంక్‌లో పెట్రోలు నింపడం వల్ల కస్టమర్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీనికి కారణం మీ కారు ట్యాంక్ ఎంత ఖాళీగా ఉంటే, దానిలో ఎక్కువ గాలి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పెట్రోల్ నింపిన తర్వాత గాలి కారణంగా పెట్రోల్ పరిమాణం తగ్గుతుంది. ఎల్లప్పుడూ కనీసం సగం ట్యాంక్ నిండా ఇంధనం ఉండేలా జాగ్రత్త వహించండి. 

3) పెట్రోల్‌ స్టేషన్లో మోసానికి ముందు పంపు యజమానులు తరచుగా మీటర్‌ను తారుమారు చేస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దేశంలోని అనేక పెట్రోల్ పంపులు ఇప్పటికీ పాత సాంకేతికతతోనే నడుస్తున్నాయి. వీటిలో అలాంటి మోసాలకు పాల్పడడం చాలా సులభం. 

4) మీరు అనేక పెట్రోల్ పంప్ ల ద్వారా ఇంధనాన్ని కొనుగోలు చేసినట్లైతే.. మీ వాహన మైలేజీని చెక్ చేసుకోవడం మంచిది. 

5) పెట్రోల్ లేదా డీజిల్ ఎల్లప్పుడూ డిజిటల్ మీటర్ పంప్ వద్ద మాత్రమే నింపాలి. పాత పెట్రోలు పంపుల వద్ద ఉన్న యంత్రాలు కూడా పాతవి కావడం వల్ల మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉంది. ఈ యంత్రాలపై తక్కువ పెట్రోల్ నింపుతారనే భయం ఎక్కువ.

6) అనేక పెట్రోల్ పంపుల వద్ద ఉద్యోగులు మీరు పేర్కొన్న మొత్తం కంటే తక్కువ ధరకే చమురు నింపుతారు. అంతరాయం ఏర్పడినప్పుడు, మీటర్ సున్నాకి రీసెట్ చేయబడుతుందని కస్టమర్‌లకు చెప్తుంటారు. కానీ మీరు దాన్ని గమనించకపోతే.. తరచుగా ఈ మీటర్ సున్నాకి తీసుకొచ్చి ఇంధనాన్ని నింపుతారు. అలా నింపింతే మీకు కావాల్సిన ఇంధనాన్ని కొనుగోలు చేయనట్లే అవుతుంది. 

7) చాలా మంది తమ కారులో ఇంధనం నింపుకునేటప్పుడు కారులోంచి దిగరు. పెట్రోలు పంపు ఉద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. పెట్రోలు నింపుతున్నప్పుడు వాహనం దిగి మీటర్ దగ్గర నిలబడాలి.

8) పెట్రోల్ పంపుల వద్ద ఆయిల్ ఫిల్లింగ్ పైపు పొడవుగా పైప్ ఉంటుంది. పెట్రోలు నింపిన తర్వాత.. ఆటో కట్‌ చేసిన వెంటనే ఉద్యోగులు వాహనంలోని నాజిల్‌ను బయటకు తీస్తారు. అటువంటి పరిస్థితిలో, పైపులో మిగిలిన పెట్రోల్ ప్రతిసారీ అందులోనే మిగిలిపోతుంది. ఆటో కట్ అయిన తర్వాత పెట్రోల్ నాజిల్ మీ వాహనం ట్యాంక్‌లో కొన్ని సెకన్ల పాటు ఉంచడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల పైప్ లో మిగిలున్న ఇంధనం కూడా వచ్చి ట్యాంకులోకి చేరుతుంది.

9) పెట్రోల్ పంపు దగ్గర నాజిల్ నుంచి ఇంధనం నింపే క్రమంలో అక్కడున్న వ్యక్తిని చేయి తీసేయమని చెప్పండి. అలా నింపే సమయంలో నాజిల్ కు ఉండే బటన్ పట్టుకొని ఉండడం వల్ల ఇంధనం వచ్చే వేగం తగ్గిపోతుంది. దాని ద్వారా మీరు మోసపోయినట్లు అవుతుంది. 

10) మీ వాహనానికి ఇంధనాన్ని నింపే క్రమంలో అక్కడున్న ఉద్యోగి మిమ్మల్ని మాటల్లో పెట్టి పెట్రోల్ దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అలాంటి సమయంలో మిమ్మల్ని మాటల్లో పెట్టి డిజిటల్ మీటర్ లో జీరో ఉందో లేదో అనే విషయం మీరు చూడకుండా అతడు పెట్రోల్ నింపుతాడు. ఈ క్రమంలో మీ వాహనాన్ని పెట్రోల్ లేదా డీజిల్ నింపే క్రమంలో కచ్చితంగా డిజిటల్ మీటర్ ను ఒకసారి చెక్ చేసుకోవాలి.  

Also Read: Stock Market today: 2021కి భారీ లాభాలతో గుడ్​బై చెప్పిన స్టాక్ మార్కెట్లు..!

Also Read: New Rules from 2022: ఏటీఎం ఛార్జీల నుంచి లాకర్ల భద్రత వరకు రేపటి నుంచి మార్పులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News