Flipkart Sale: రూ.20,990 విలువైన వివో టీ1 5జీ ఫోన్ కేవలం రూ.490కే.. లిమిటెడ్ ఆఫర్​!

Flipkart Sale: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్​ల్​ మొబైల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. వివో టీ1 5జీ మోడల్​ను రూ.490కే సొంతం చేసుకునే వీలు కల్పిస్తోంది. ఆఫర్ పూర్తి వివరాలివే.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2022, 07:17 PM IST
  • నేటి నుంచే వివో టీ1 5జీ విక్రయాలు షురూ
  • భారీ డిస్కౌంట్​తో విక్రయిస్తున్న ఫ్లిప్​కార్ట్​
  • అత్యంత చౌకకే 5జీ ఫోన్ కొనే అవకాశం..
Flipkart Sale: రూ.20,990 విలువైన వివో టీ1 5జీ ఫోన్ కేవలం రూ.490కే.. లిమిటెడ్ ఆఫర్​!

Flipkart Sale: స్మార్ట్​ఫోన్లను భారీ డిస్కౌంట్​లో విక్రయించేందుకు.. ఫ్లిప్​కార్ట్ నిర్వహిస్తున్న.. మొబైల్ బొనాంజ సేల్ ఆఖరి రోజుకు చేరుకుంది. మరి చివరి రోజు సేల్​లో బెస్ట్ ఆఫర్​ను మీ ముందుకు తెస్తున్నాం.

ఆఫర్ వివరాలు ఇలా..

చైనాకు చెంది ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ వివో ఇటీవల విడుదల చేసిన.. వివో టీ1 5జీ ఫోన్​పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది ఫ్లిప్​కార్ట్. నేటి నుంచే సేల్​కు వచ్చిన ఈ ఫోన్ ధర రూ.20,990. కాగా ఈ ఫోన్​ను.. 19 శాతం తగ్గింపుతో రూ.16,990కు విక్రయిస్తోంది ఫ్లిప్​కార్ట్​.

హెచ్​డీఎఫ్​సీ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే.. రూ.1000 తక్షణ డిస్కౌంట్ వస్తుంది. అంటే ఈ ఫోన్ ధర రూ.15,990కు తగ్గుంతుంది.

హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డ్, డెబిట్​ కార్డ్​ సహా ఈఎంఐలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే..

ఆఫర్ ఇక్కడితో ఐపోలేదు. ఈ ఫోన్​పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్​ను కూడా ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. మీ దగ్గర ఉన్న పాత ఫోన్​ను ఎక్స్ఛేంజ్​ చేయడం ద్వారా రూ.16,990 వరకు తగ్గింపు పొందొచ్చు.

ఒక వేల మీకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తిగా లభిస్తే.. అప్పుడు ఫోన్​ ధర రూ. 490కి (రూ.15,990-రూ.15,500) చేరుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు ఎక్స్ఛేంజ్ చేసే ఫోన్​ కండీషన్​ను బట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్ వర్తిస్తుంది.

ఫోన్​ ఫీచర్లు..

  • 6.58 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్ డిస్​ప్లే
  • 6 జీబీ ర్యామ్​/128 జీబీ స్టోరేజ్​
  • క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​
  • వెనకవైపు మూడు కెమెరాలు 50 ఎంపీ+2 ఎంపీ+2ఎంపీ
  • 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • 5,000 ఎంఏహెచ్​ లిథియం బ్యాటరీ

Also read: Investors lose: ఒక్క రోజులో రూ.8.5 లక్షల కోట్ల సంపదను తుడిచేసిన నష్టాలు!

Also read: Flipkart Mi Smart TV: రూ.30 వేల విలువైన Mi స్మార్ట్ టీవీ.. ఇప్పుడు రూ. 10,499లకే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News