Flipkart Offers: రూ.60 వేల LG 43 ఇంచుల స్మార్ట్ టీవీ కేవలం రూ.21 వేలకే.. ఆఫర్ మూడు రోజులు మాత్రమే!

RS 60 thousand LG 43 Inch TV gets only Rs 21K in Flipkart. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఎల్‌జీ 108 సెం.మీ (43 అంగుళాలు) అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 29, 2022, 03:43 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బచత్ ధమాల్ సేల్
  • జులై 1న సేల్ ప్రారంభం
  • రూ.21 వేలకే ఎల్‌జీ 43 ఇంచుల స్మార్ట్ టీవీ
Flipkart Offers: రూ.60 వేల LG 43 ఇంచుల స్మార్ట్ టీవీ కేవలం రూ.21 వేలకే.. ఆఫర్ మూడు రోజులు మాత్రమే!

Flipkart LG 43 Inch TV Offers: ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే 'బిగ్ బచత్ ధమాల్ సేల్' కింద స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. పలు బ్రాండెడ్ టీవీలపై  డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఆఫర్ ఉపయోగించుకుంటే.. సగం కన్నా తక్కువ ధరకే టీవీని మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఎల్‌జీ 108 సెం.మీ (43 అంగుళాలు) అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. రూ.60 వేలు విలువ చేసే ఈ టీవీని కేవలం రూ.22 వేలకే మీ సొంతమవుతుంది. 

ఎల్‌జీ 108 సెం.మీ (43 అంగుళాలు) అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.59,990లుగా ఉంది. ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్ టీవీపై 45 శాతం భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అంటే రూ. 27000 వేల తగ్గింపుతో.. ఈ స్మార్ట్ టీవీ రూ. 32,999 లకు మీకు లభిస్తుంది. ఈ టీవీని డెబిట్ లేదా క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేసినట్లయితే.. మరో రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు ఇంచుమించుగా రూ.31,499లకు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. 

ఎల్‌జీ 108 సెం.మీ (43 అంగుళాలు) అల్ట్రా హెచ్‌డీ ఎల్‌ఈడీ స్మార్ట్ టీవీపై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత టీవీని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 11,000 వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత టీవీ కండిషన్‌ బాగుండి పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే.. ఎల్‌జీ 43 అంగుళాల టీవీని దాదాపుగా రూ. 20,999 సొంతం చేసుకోవచ్చు. అయితే డిస్కౌంట్స్‌కి, ఎక్స్‌చేంజ్‌కి కండిషన్స్ వర్తిస్తాయని గుర్తుంచుకోండి. బిగ్ బచత్ ధమాల్ సేల్ ఉన్నంతవరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బిగ్ బచత్ ధమాల్ సేల్ జులై 1న ప్రారంభం అయి 3తో ముగియనుంది. 

Also Read: ప్రతి నెలా రూ.12500 డిపాజిట్ చేయండి.. రూ. 1 కోటి పొందండి! పూర్తి వివరాలు ఇవే

Also Read: దీపక్‌ హుడా అరుదైన రికార్డు.. నాలుగో ప్లేయర్‌గా..! కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News