Flipkart Best Offers: నేటి నుంచే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 అమ్మకాలు.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.999కే

Flipkart Best Offers: తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారి కోసం ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jun 29, 2022, 03:05 PM IST
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 13 అమ్మకాలు నేటి నుంచే
  • ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న గెలాక్సీ ఎఫ్ 13
  • భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్
Flipkart Best Offers: నేటి నుంచే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 అమ్మకాలు.. ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.999కే

Flipkart Best Offers: ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తీసుకొచ్చిన సరికొత్త మోడల్ గెలాక్సీ ఎఫ్ 13 అమ్మకాలు ఇండియాలో నేటి (జూన్ 29) నుంచే ప్రారంభమయ్యాయి. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌‌లో ప్రస్తుతం ఈ బ్రాండ్ సేల్స్ కొనసాగుతున్నాయి. పలు బ్రాండ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తున్న ఫ్లిప్‌కార్ట్ దీనిపై కూడా భారీ డిస్కౌంట్‌‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌ను వినియోగించుకోగలిగితే డెడ్ చీప్‌ ధరకే బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకున్నట్లవుతుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో  దాదాపు రూ.17 వేలు విలువ చేసే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (నైట్‌స్కై గ్రీన్, 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ :

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (నైట్‌స్కై గ్రీన్, 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌ సాధారణ ధర రూ.16,999. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 23 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే రూ.4 వేలు వరకు ఆదా అవుతుంది. డిస్కౌంట్ పోను రూ.12,999కే ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు మీరు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడినట్లయితే మరో రూ.1000 వరకు తక్షణ తగ్గింపు పొందే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్‌ను మరింత చౌకగా రూ.11,999కే కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ.2167 చెల్లించడం ద్వారా నో కాస్ట్ ఈఎంఐ పద్దతిలోనూ ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో రూ.999కే :

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (నైట్‌స్కై గ్రీన్, 128 జీబీ) స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ను మార్చుకోవడం ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు. మీ ఫోన్‌ కండిషన్‌ను బట్టి రూ.12,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే.. రూ.16,999కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ని మరింత చౌకగా రూ.999కే మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కు షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫీచర్స్ :

6.6 అంగుళాల డిస్‌ప్లే
ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్
50MP + 5MP + 2MP ప్రైమరీ కెమెరా
8MP సెకండరీ కెమెరా
4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ

 

Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ కి మరో అరుదైన గౌరవం.. ఇండియా నుంచే ఏకైక సినిమాగా!

Also Read:Dollar Vs Rupee: డాలర్‌తో రూపాయి పోటీ పడలేకపోతోందా..మనకు లాభామా..నష్టమా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News