Fact Check: మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ వాషింగ్ మెషిన్ స్కీం ప్రారంభిస్తున్న మోదీ సర్కార్

Free washing machine scheme: కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా వాషింగ్ మిషన్ స్కీం ప్రారంభించిందా?  ఇకపై నిజంగానే మహిళలకు ఇంట్లో బట్టలు ఉతికే పని లేదా?  ఇందులో నిజా నిజాలు ఏంటో తెలుసుకుందాం.  

Written by - Bhoomi | Last Updated : Oct 7, 2024, 05:46 PM IST
 Fact Check: మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ వాషింగ్ మెషిన్  స్కీం ప్రారంభిస్తున్న  మోదీ సర్కార్

Free washing machine scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అనేక వర్గాలకు చెందిన ప్రజలను లబ్ధిదారులుగా మారుస్తుంది. తద్వారా వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. పీఎం కిసాన్ యోజన, ముద్ర యోజన ఇలాంటి స్కీముల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక మార్గాలను ఎంచుకుంది. దీంతోపాటు ముఖ్యంగా షెడ్యూల్డ్ తరగతులు, తెగలు, మహిళలను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వీటి నుంచి లబ్ధి పొందుతున్న వారు కోట్ల సంఖ్యలో ఉన్నారు.

అయితే కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రజలను మభ్య పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పేరిట ఫేక్ సమాచారాన్ని వ్యాప్తిలోకి తెస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ సమాచారం, ఫేక్ ప్రభుత్వ పథకాలు కోకోల్లలుగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం త్వరలోనే మహిళలు అందరికీ ఉచిత వాషింగ్ మిషన్ పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది అని థంబ్ నెయిల్ పెట్టి వీడియోను విడుదల చేసింది. 

అయితే దీనిపై కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ పిఐబి నిజానిర్ధారణలో భాగంగా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా దీనిపై వివరణ ఇచ్చింది. ఉచిత వాషింగ్ మిషన్ స్కీమ్ అనేది ఒక అద్భుత కల్పన మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని ఏమీ ప్రారంభించడం లేదని. ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసింది. నెటిజన్లు ఇటువంటి వార్తలను గుర్తిస్తే తమ దృష్టికి తేవాలని తద్వారా నిజ నిర్ధారణ చేసుకోవచ్చని తెలిపింది. 

Also Read: Tech Tips: 5జీ నెట్ వర్క్ ఉన్నప్పటికీ నెట్ స్లోగా ఉందా.. ఈ టిప్స్ పటిస్తే రాకెట్ స్పీడ్ పక్కా    

ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పేరిట పలు ఫేక్ సంక్షేమ కార్యక్రమాల గురించి సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్న మాట తెలిసింది. అయితే వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలను సేకరించడంతోపాటు, ఆధార్ నెంబర్ బ్యాంకు డీటెయిల్స్ వంటివి సైతం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లయితే మీ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు సైతం మాయం అయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్కీం ప్రారంభించిన క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రకటిస్తుందని, దీనిపైన నేరుగా ప్రభుత్వ శాఖలే ప్రజల్లో అవగాహన కల్పిస్తాయని ప్రసార మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. ప్రజలను మోసం చేసే ఇలాంటి సైబర్ దొంగలను అరికట్టడానికి, నెటిజెన్లు తమ దృష్టికి వచ్చిన ఫేక్ సమాచారాన్ని సైబర్ పోలీస్ విభాగానికి తెలియజేయాలని సూచన చేసింది. లేకపోతే అమాయకులు వీరి వలకి చిక్కే ప్రమాదం ఉంటుంది.

Also Read: Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులు  

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News