EPFO Higher Pension Scheme Benefits: ప్రావిడెంట్ ఖాతాదారులకు అధిక పెన్షన్ అందుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకు గడువు జూన్ 26వ తేదీగా నిర్ణయించింది. మరో 10 రోజులే సమయం ఉండగా.. ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మీకు కూడా హయ్యార్ పెన్షన్ కావాలంటే.. జూన్ 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులు అయినా.. ప్రైవేట్ ఉద్యోగులు అయినా.. రిటైర్మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదని కేంద్ర ప్రభుత్వం అధిక పెన్షన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఉద్యోగులకు ఇష్టమైతేనే ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చని ఆప్షన్ ఇచ్చింది.
హయ్యర్ పెన్షన్ స్కీమ్‌కు సంబంధించి గతేడాది నవంబర్‌లో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును కూడా ఇచ్చింది. అధిక పెన్షన్ ఎంచుకునేందుకు నాలుగు నెలల సమయం ఇచ్చింది. ప్రస్తుతం జూన్ 26వ తేదీ వరకు సమయం ఉంది. ఇంతకుముందు మే 3వ ఉండగా.. చాలా మంది దరఖాస్తు చేసుకోకపోవడంతో గడువు పెంచుతూ ఈపీఎఫ్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరో పది రోజులే సమయం ఉండడంతో ఇంకా దరఖాస్తు చేసుకోని వారు అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు.
మీకు అధిక పెన్షన్ కావాలని అనుకుంటే.. ఉద్యోగ విరమణ తరువాత మీ చేతి వచ్చే మొత్తం అమౌంట్‌లో కొంత తగ్గుతుంది. కానీ మీకు నెలవారీగా వచ్చే పెన్షన్ డబ్బులు ఎక్కువగా ఉంటాయి. హయ్యర్ పెన్షన్ స్కీమ్‌తో లాభాలతో పాటు.. నష్టాలు కూడా ఉన్నాయి. ఇందుకు సబంధించిన విషయాలు ఇంకా స్పష్టత లేదు. అదనపు సహకారం ఆప్షన్ ఎలా పని చేస్తుంది..? అధిక పెన్షన్‌ను ఎంచుకుంటే చెల్లింపు విధానం ఎలా ఉంటుంది..? ఎక్కువ మొత్తం అడిగే సందర్భంలో అధిక పెన్షన్ స్కీమ్ నుంచి వైదొలిగే అవకాశం ఖాతాదారుడికి లభిస్తుందో లేదో కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.
Also Read: Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?
అదనపు మొత్తాన్ని ప్రాంతీయ అధికారి నిర్ణయిస్తారని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఎంత మొత్తాన్ని నిర్ణయిస్తారో.. అధిక పెన్షన్‌ను ఎంచుకునే వాటాదారులకు వడ్డీతో పాటు దాని గురించి సమాచారాన్ని అందజేస్తారని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. పింఛనుదారులు/సభ్యులు నగదు జమ చేసేందుకు.. నిధుల బదిలీకి పర్మిషన్ ఇవ్వడానికి 3 నెలల వరకు సమయం ఉంటుందని తెలిపారు. 15 వేల బేసిక్ శాలరీపై ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)కి ప్రభుత్వం 1.16 శాతం సబ్సిడీగా అందిస్తుంది. ఈపీఎఫ్‌ఓ సామాజిక భద్రతా పథకానికి ఉద్యోగుల జీతం నుంచి 12 శాతం కట్ అవుతుంది. యజమాని 12 శాతం అమౌంట్‌లో 8.33 శాతం ఈపీఎస్‌కి వెళుతుంది. మిగిలిన 3.67 శాతం ఉద్యోగుల భవిష్య నిధిలో జమ అవుతుంది.
Also Read: Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి