Blue Tick: ఎక్స్‌లో మళ్లీ బ్లూ టిక్ వచ్చేసిందిగా, నో పేమెంట్, అంతా ఉచితమే

Blue Tick: ప్రముఖ సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ ఎక్స్ యూజర్లకు శుభవార్త అందిస్తోంది ఎక్స్‌గా మారిన ట్విట్టర్ యూజర్లకు ఇకపై ఆ వెరిఫికేషన్ మళ్లీ ఉచితంగా లబించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 5, 2024, 04:55 PM IST
Blue Tick: ఎక్స్‌లో మళ్లీ బ్లూ టిక్ వచ్చేసిందిగా, నో పేమెంట్, అంతా ఉచితమే

Blue Tick: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ఇటీవలి కాలంలో చాలా మార్పులకు లోనైంది. 2022లో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తరువాత ట్విట్టర్ ఆదరణ తగ్గుతూ వస్తోంది. దీనికి కారణం ఎలాన్ మస్క్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలే. 

ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చాక పేరు మార్చుకుంది లోగో మార్చుకుంది. ట్విట్టర్ కాస్తా ఎక్స్ అయింది. లోగో కూడా మారిపోయింది. అంతేకాదు..ట్విట్టర్‌గా ఉన్నప్పుడు వెరిఫైడ్ కస్టమర్ల సూచనగా ఇచ్చే బ్లూ టిక్‌ను అమ్ముకోవడం ప్రారంభించింది. ట్విట్టర్‌లో బ్లూ టిక్ అంటే చాలా గొప్ప విషయంగా భావిస్తారు. అలాంటిది ఎలాన్ మస్క్ బ్లూటిక్‌కు ఓ ధర నిర్ణయించాడు. ఉచితంగా బ్లూ టిక్ ఇవ్వడాన్ని తొలగించాడు. నెలకు ప్రారంభ ఫీజు 8 డాలర్లు చెల్లిస్తే ఎక్స్‌లో బ్లూ టిక్ లభిస్తుంది. దాంతో సెలెబ్రిటీలు, హై ఫ్రొఫైల్ వ్యక్తులు, వీవీఐపీల ఎక్కౌంట్  నుంచి బ్లూ టిక్ తొలగిపోయింది. ఇదే అదనుగా ఫేక్ ఎక్కౌంట్లు పుట్టుకొచ్చేశాయి. దాంతో ఏది ఆసలైన ఎక్కౌంట్, ఏది డూప్లికేట్ అనేది తెలుసుకోవడం కష్టమైపోయింది. 

ఈ పరిస్థితిని గమనించిన ఎలాన్ మస్క్ బ్లూ టిక్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై బ్లూ టిక్ ఉచితంగా అందిస్తామని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. దీనికోసం షరతులు విధించారు. 2500 మంది ఫాలోవర్లు దాటితే బ్లూ టిక్ పూర్తిగా ఉచితంగా ఇస్తామన్నారు. ప్రీమియం ఫీచర్లు కూడా అందిస్తామని చెప్పారు. ఇక 5000 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉంటే బ్లూ టిక్‌తో పాటు ప్రీమియం ప్లస్ కల్పించనుంది. ఎలాన్ మస్క్ ఇలా నిర్ణయం తీసుకున్నారో లేదా గతంలో బ్లూ టిక్ పోగొట్టుకున్నవారికి తిరిగి బ్లూ టిక్ వచ్చేసింది. 

Also read: UPI New Feature: యూపీఐలో సరికొత్త ఫీచర్, ఇక నుంచి యూపీఐతో క్యాష్ డిపాజిట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News