Gita Gopinath: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో (ఐఎంఎఫ్) చీఫ్ ఎకానమిస్ట్‌గా ఉన్న ఇండో-అమెరికన్ గీతా గోపీనాథ్‌కు (Gita gopinath imf chief economist) పదోన్నతి లభించింది. గీతా గోపీనాథ్‌కు తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తున్నట్లు ఐఎంఎఫ్ గురువారం ప్రకటించింది.
ప్రస్తుతం డిప్యూటీ ఎండీగా ఉన్న జెఫ్రీ ఒకామోటో వచ్చే ఏడాది తొలినాళ్లలో ఐఎంఎఫ్‌ను వీడనున్నారు. ఆయన స్థానాన్ని గీతా గోపీనాథ్ భర్తీ (Gita gopinath Promoted as IMF's First Deputy MD) చేయనున్నారు.
అయితే గీతా గోపీనాథ్ దాదాపు మూడేళ్లుగా ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకానమిస్ట్‌గా (Gita gopinath imf) సేవలందిస్తున్నారు. 2022 జనవరిలో అమె ఐఎంఎఫ్‌ను వీడి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అమెకు పదోన్నతి లభించిన నేపథ్యంలో ఇంకొంత కాలం అమె ఐఎంఎఫ్‌లో సేవలందించనున్నట్లు స్పష్టమైంది.
గీతా గోపీనాథ్ స్పందన..
మొదటి డిబ్యూటీ ఎండీగా పదోన్నతి కల్పించినందుకు గీతా గోపీనాథ్ (Gita Gopinath about) ఐఎంఎఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
'ఐఎంఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజర్‌గా ఎంపికవడం గర్వంగా భావిస్తున్నా. కరోనా సమయంలో ఫండ్ (ఐఎంఎఫ్) పని చాలా ముఖ్యమైంది. ఎంతో నిపుణులైన నా సహోద్యోగులతో కలిసి పని చేస్తూ.. ఈ సవాళ్లను అదిగమించేందుకు ఎదురు చూస్తున్నా' అని గీతా గోపీనాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
I am honored to become the IMF’s First Deputy Managing Director. With the pandemic, the work of the Fund has never been more important. I look forward to working with my brilliant colleagues to help our membership face these important challenges.https://t.co/jpp3C7dRog
— Gita Gopinath (@GitaGopinath) December 2, 2021
ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలినా ఏమన్నారంటే..
జెఫ్రీ ఒకామోటో, గీతా గోపీనాథ్ ఇద్దరు తనకు ఎంతో మంచి సహచరులుగా చెప్పుకొచ్చారు ఐఎంఎఫ్ ఎండీ క్రిస్ఠాలినా జార్జివా. జెప్రీ ఐఎంఎఫ్‌ను వీడుతుండటం బాధగా ఉందని (IMF MD Kristalina Georgieva) పేర్కొన్నారు. అయితే గీతా గోపీనాథ్ తిరిగి ఐఎంఎఫ్‌లో కొనసాగాలని నిర్ణయించుకోవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కొత్త బాధ్యతలను స్వీకరించనున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు.
Also read: Bad News: కొత్త సంవత్సరం నుంచి బాదుడు షురూ.. ATM క్యాష్ విత్ డ్రా ఛార్జీల పెంపు
Also read: Indian Railways: ఇండియన్ రైల్వే ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook