Credit Card Late Fee Charges: క్రెడిట్ కార్డు బిల్లులపై లేట్ ఫీజు తక్కువ వసూలు చేసే బ్యాంకు ఏదో తెలుసా?

Credit Card Late Fee Charges: క్రెడిట్ కార్డు వినియోగదారులను అనేక ఆఫర్లతో ప్రముఖ బ్యాంకులు ఆకర్షించడం సహా బిల్లులను సకాలంలో చెల్లించని వారిపై కొరడా ఝళిపిస్తున్నాయి. బిల్లులను సకాలంలో చెల్లించని క్రమంలో వారు తీసుకున్న మొత్తంపై పెనాల్టీ సహా వడ్డీ అధికంగా వసూలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఉన్న ప్రముఖ బ్యాంకులు క్రెడిట్ కార్డు లేట్ చెల్లింపులపై విధించే రుసుములు వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 04:10 PM IST
    • క్రెడిట్ కార్డు వినియోగదారులుకు బ్యాడ్ న్యూస్
    • బిల్లులను సకాలంలో చెల్లించకుంటే ఛార్జీల మోత
    • రూ.1,000 నుంచి రూ.1,300 వరకు వసూలు చేయనున్న బ్యాంకులు
Credit Card Late Fee Charges: క్రెడిట్ కార్డు బిల్లులపై లేట్ ఫీజు తక్కువ వసూలు చేసే బ్యాంకు ఏదో తెలుసా?

Credit Card Late Fee Charges: కస్టమర్లను ఆకర్షించేదుకు ప్రస్తుతం అనేక బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. ఆ కార్డుల ద్వారా లక్షల్లో కొనుగోలు చేసేందుకు వెసులుబాటు కల్పించడం సహా అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.  అయితే, క్రెడిట్ కార్డ్ బకాయిలను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే వాటిపై సదరు బ్యాంకులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సకాలంలో చెల్లించని క్రెడిట్ కార్డు బిల్లులకు లేట్ ఛార్జీలను భారీగా విధిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్న ప్రముఖ బ్యాంకుల లేట్ ఛార్జీలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

ICICI బ్యాంక్ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ మినహా అన్ని క్రెడిట్ కార్డ్‌లకు ఆలస్య చెల్లింపు ఛార్జీలను కూడా ఆ బ్యాంక్ సవరించింది. ఆలస్య చెల్లింపు ఛార్జీలు మొత్తం చెల్లించాల్సిన మొత్తంతో మారుతూ ఉంటాయి. 

మీ బకాయి మొత్తం రూ.100 కంటే తక్కువగా ఉంటే, బ్యాంకు మీకు ఛార్జీ విధించదు. కానీ, అంతకు మించి రుసుములు చెల్లించాల్సిన బిల్లులకు అంటే రూ.50 వేలు అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే.. దానికి అత్యధిక రూ.1200 లేట్ ఛార్జ్ వసూలు చేయనుంది. 

ICICI బ్యాంకుతో పాటు మార్కెట్లో ప్రముఖంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. వీటిలో క్రెడిట్ కార్డు బిల్లు రూ.50 వేల పైబడిన వారికి లేట్ ఛార్జెస్ రూపంలో అత్యధికంగా (వరుసగా) రూ.1,300, రూ.1,300, రూ.1000 వసూలు చేయనున్నారు. 

SBI క్రెడిట్ కార్డు రుసుములు

SBI క్రెడిట్ కార్డు ద్వారా రూ.500 లేదా అంతకంటే తక్కువ ఉన్న బిల్లింగ్ కు ఎలాంటి ఆలస్య రుసుమును వసూలు చేయరు. ఆ తర్వాత రూ.501 నుంచి రూ.1000 వరకు ఉన్న బిల్లులపై రూ.400.. 1,001-10 వేల బిల్లింగ్ వరకు లేట్ పేమెంట్ ఛార్జీలు రూ.1,300 వరకు వసూలు చేయనున్నారు. 

నగదు ముందస్తు వడ్డీ 2.5 శాతంగా విధించనున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా విత్ డ్రా లేదా ఓవర్ లిమిట్ ఛార్జీ 2.5 శాతం లేదా గరిష్టంగా రూ.600 వరకు చెల్లించాలి. 

HDFC క్రెడిట్ కార్డు రుసుములు
రూ.100లోపు బిల్లులపై ఎలాంటి ఛార్జ్ ఉండదు. రూ.100-500 బిల్లుపై రూ.100 ఆలస్య చెల్లించాల్సి ఉంటుంది. రూ.501- 5,000 వరకు బిల్లులపై రూ.500, ఆలస్య చెల్లింపు ఛార్జీలు రూ.5,001- 10,000 వరకు రూ.600.. రూ.10,001- 25,000 బిల్లులపై రూ.800.. రూ.25,001- 50,000 వరకు రూ.1100 వరకు వసూలు చేయనున్నారు. 

అదే విధంగా రూ.50 వేల కంటే ఎక్కువ బిల్లు కలిగిన వారికి ఆలస్య రుసుము అత్యధికంగా రూ.1,300 వరకు వసూలు చేయనున్నారు. అయితే హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డుల ద్వారా క్యాష్ అడ్వాన్స్ ఛార్జీ (విత్ డ్రా చేసిన నగదు) 2.5 శాతం లేదా రూ.500 వసూలు చేస్తారు. మరోవైపు ఓవర్ లిమిట్ ఛార్జీలు 2.5 శాతంగా లేదా గరిష్టంగా రూ.550.. కనిష్టంగా 2 శాతం లేదా రూ.450 ఆటో డెబిట్ లేదా చెక్ రిటర్న్ ఫీజుగా వసూలు చేయనున్నారు. 

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు రుసుములు

ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగిస్తున్న కస్టమర్లు ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. 2022 ఫిబ్రవరి 10 నుంచి ఆ బ్యాంకు నగదు అడ్వాన్స్ లావాదేవీపై రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కనిష్టంగా రూ.500, గరిష్టంగా రూ.2.5 శాతం అదనపు రుసుము చెల్లించాలి. 

అయితే ఆలస్య చెల్లింపు ఛార్జీలు మొత్తం బకాయితో మారుతూ ఉంటాయి. మీ బకాయి మొత్తం రూ.100 కంటే తక్కువగా ఉంటే, బ్యాంక్ మీకు ఛార్జీ విధించదు. అయితే, అధిక మొత్తాలకు నిర్ణీత మొత్తంలో ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి. రూ.50,000 కంటే ఎక్కువ మొత్తానికి బ్యాంక్ వసూలు చేసే అత్యధిక మొత్తం రూ.1200గా ఉంటుంది.

AXIS బ్యాంక్ క్రెడిట్ కార్డు రుసుములు

రూ.300 లోపు బిల్లులపై ఎలాంటి ఛార్జీ ఉండదు. రూ.300- 500 బిల్లుపై రూ.100 లేట్ పేమెంట్ చార్జీ ఉంటుంది. రూ.501- 1000 వరకు బిల్లులకు రూ.500.. అదే విధంగా  రూ.1001- 10000 వరకు ఆలస్య చెల్లింపు ఛార్జీ రూ.1000లను యాక్సిస్ బ్యాంకు వసూలు చేయనుంది. 

హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్‌లపై నగదు అడ్వాన్స్ ఛార్జీ విత్‌డ్రా చేసిన నగదుపై 2.5% లేదా రూ.500.. (ఏది ఎక్కువ ఉండే అది వర్తిస్తుంది) వసూలు చేస్తారు. ఓవర్‌లిమిట్ ఛార్జ్ 3% లేదా గరిష్టంగా రూ.500. ఆటో డెబిట్ లేదా చెక్ రిటర్న్ ఫీజుగా కనీసం 2% లేదా రూ. 450 వసూలు చేయనున్నారు. గరిష్టంగా 1,500 రూపాయలు వసూలు చేస్తారు.

నవంబరు నెలలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అక్టోబరు 2021లో క్రెడిట్ కార్డుల వినియోగం 1.84 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అక్టోబరు 21 లోపు 2 శాతం.. సెప్టెంబరు 21 లోపు 1.7 శాతం పెరిగింది. 

క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించకపోతే?

క్రెడిట్ కార్డు కస్టమర్లు సకాలంలో బిల్లులు చెల్లించని క్రమంలో సదరు బ్యాంకుల నుంచి హెచ్చరిక ఎదుర్కొక తప్పదు. గడువులోపు చెల్లింపులను పూర్తి చేయాలని మెయిల్, SMS ద్వారా సదరు బ్యాంకులు గుర్తుచేస్తాయి. నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేయకపోతే పెనాల్టీతో పాటు ఆ మొత్తానికి వడ్డీ కూడా విధిస్తారు. దీనితో పాటు ఆ తదుపరి నెలలో వడ్డీ రహిత ఫైనాన్సింగ్ అందుబాటులో ఉండదు. మరీ ముఖ్యంగా మీ క్రెడిట్ హిస్టరీ లేదా క్రెడిట్ స్కోర్ క్షీణించడం వల్ల భవిష్యత్తులో ఫైనాన్స్ పొందే అవకాశాలు తగ్గిపోతాయి. 

Also Read: Tesla chief elon musk: తెలంగాణకు పోటీగా పశ్చిమ బెంగాల్.. గెలుపు ఎవరిదో!

Also Read: EPFO Withdrawal: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్ న్యూస్... ఇకపై రెండుసార్లు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News