Citroen 7 Seater Car: ఫ్రాన్స్ దేశపు కారు కంపెనీ సిట్రోయెన్ త్వరలో ఇండియాలో సిట్రోయెన్ సి5, సిట్రోయెన్ సి3, సిట్రోయెన్ ఇసి3 విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ కార్లు దేశంలో అడుగెడితే క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, హైరైడర్, యాస్టర్ కార్లకు పోటీ కానుంది.
భారతీయ మార్కెట్‌లో త్వరలోనే సిట్రోయెన్ మూడు వేరియంట్లలో కార్లు లాంచ్ చేయనుంది. సిట్రోయెన్ లాంచ్ చేయనున్న సిట్రోయెన్ సి5, సిట్రోయెన్ సి3, సిట్రోయెన్ ఇ సి3లు దేశంలోని క్రెటా, సెల్టోస్, గ్రాండ్ విటారా, హైరైడర్, యాస్టర్ కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిట్రోయెన్ సి3 ప్లస్ పేరుతో ఓ కారు టెస్టింగ్ జరుగుతోంది. సిట్రోయెన్ సి3 ఆధారంగా ఉంటుంది. ఇందులో 7 సీటర్, 5 సీటర్ రెండూ అందుబాటులో ఉంటాయి.
ఇప్పటి వరకూ సిట్రోయెన్ గురించి లీక్ అయిన వివరాల ప్రకారం సి3 ఒక హ్యాచ్‌బ్యాక్ డిజైన్ కారు. సీ పిల్లర్ తరువాత కారును పొడిగించారని తెలుస్తోంది. సిట్రోయెన్ సి3 ప్లస్ కాంపాక్ట్ ఎస్‌యూవీ పొడుగు దాదాపుగా 4.2-4.3 మీటర్లు ఉండవచ్చు. ఇప్పటికే విడుదలై ఓ ఫోటోలో సిట్రోయెన్ సి3 ప్లస్..కియా సెల్టోస్ పక్కన ఉంది. దీనిని బట్టి పొడుగు ఎంత ఉందో అంచనా వేయవచ్చు.
లోపలివైపు పరిశీలిస్తే..సీ3 హ్యాచ్‌బ్యాక్‌తో పోలిస్తే కాస్త ప్రత్యేకంగా ఉంది. స్టీరింగ్ వీల్, ఇతర స్విచ్ గేర్ సీ3లానే ఉన్నాయి. కానీ డ్యాష్‌బోర్డ్ డిజైన్ వేరుగా ఉంది. కారు మధ్యలో క్వాడ్ ఏసీ వెంట్స్ స్థానంలో రెండు పెద్ద పెద్ద ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇందులో టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ కూడా విభిన్నంగానే ఉంది.
ప్రస్తుతం సిట్రోయెన్ సీ3 హ్యాచ్‌బ్యాక్‌లో క్లైమెంట్ కంట్రోల్, ఎల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్ ఎడ్జస్టెబుల్ ఓఆర్వీఎం, డైమింగ్ ఐఆర్వీఎం రివర్స్ పార్కింగ్ కెమేరా, రేర్ వైపర్, డీఫాగర్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇక ఇంజన్ గురించి పరిశీలిస్తే..ఇందులో 110 బీహెచ్‌పీ, 190 ఎన్ఎంతో పాటు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. దీంతోపాటు 6 స్పీడ్ ఎంటీ గేర్ బాక్స్ ఉంది. సిట్రోయెన్ సి3 ఎస్ యూవి ధర 10 లక్షల నుంచి ప్రారంభమై 15 లక్షల వరకూ ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి లాంచ్ చేయవచ్చు.
Also read: Repo Rate Hike: మళ్లీ పెరగనున్న రెపో రేటు.. ఈఎంఐల మోత తప్పదా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Citroen 7 Seater Car: అత్యంత చౌకైన విదేశీ 7 సీటర్ కారు, ఎర్టిగా, క్రెటాలకు ఇక కష్టమే