Best 7 Seater Car: కేవలం 6 లక్షలకే బెస్ట్ 7 సీటర్ ఎంపీవీ కారు, ధర, ఫీచర్లు ఇలా

Best 7 Seater Car: దేశంలో గత కొద్దికాలంగా 7 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. కానీ బడ్జెట్ ఎక్కువ కావడంతో చాలామంది వెనుకంజ వేస్తున్నారు. కానీ ఇప్పుడు మేం మీకు అందిస్తున్న ఆఫర్ చూస్తే మీరు అనుకున్న బడ్జెట్‌లోనే 7 సీటర్ కారు వచ్చేస్తుంది. అదెలాగో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 11, 2024, 12:39 PM IST
Best 7 Seater Car: కేవలం 6 లక్షలకే బెస్ట్ 7 సీటర్ ఎంపీవీ కారు, ధర, ఫీచర్లు ఇలా

Best 7 Seater Car: దేశంలోని కారు మార్కెట్‌లో 7 సీటర్ ఎంపీవీ కార్లకు ఆదరణ ఎక్కువ. 7 సీటర్ కారు అనగానే సహజంగానే మారుతి సుజుకి కంపెనీకు చెందిన XL6 లేదా Ertiga పేరు చెప్పవచ్చు. ఈ కార్ల ప్రారంభ ధర దాదాపుగా 9 లక్షల్నించి 13 లక్షల వరకూ ఉంటుంది. అందుకే చాలామంది వెనుకంజ వేస్తుంటారు.

అయితే 7 లక్షల బడ్జెట్‌లో మంచి 7 సీటర్ ఎంపీవీ లభిస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఎందుకంటే 7 లక్షల బడ్జెట్ అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అత్యంత చౌకైన, ఆకర్షణీయమైన ఆఫర్ మీకోసం సిద్ధంగా ఉంది. ఈ ఆఫర్‌లో మీకు కచ్చితంగా మంచి 7 సీటర్ లభిస్తుంది. 7 లక్షల బడ్జెట్‌లో లభించే 7 సీటర్ అంటే రీనాల్ట్ ట్రైబర్ గురించి చెప్పుకోవాలి. ఇదొక ఎంట్రీ లెవెల్ ఎంపీవీ. ఇందులో 7మంది చాలా సులభంగా కూర్చోవచ్చు. బూట్ స్పేస్ కూడా బాగుంటుంది. రీనాల్ట్ ట్రైబర్ కారు గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రీనాల్ట్ ట్రైబర్ స్పెసిఫికేషన్లు

రీనాల్ట్ ట్రైబర్‌లో 1.0 లీటర్ 3 సిలెండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఎంట్రీలెవెల్ హ్యాచ్‌బ్యాక్‌తో సమానం. ఈ కారు ఇంజన్ 96 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 72 పీఎస్ సామర్ధ్యంతో పవర్ ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ అయితే లీటర్‌కు 18-19 కిలోమీటర్ల వరకూ ఇస్తుంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్, ఆటోమేటిక్  ఆప్షన్లు రెండూ ఉన్నాయి. ఇందులో 20.32 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌‌మెంట్  సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, ఫోన్ కంట్రోల్, ఎల్ఈడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్ యాక్సెస్ కార్డడ, పుష్ స్టార్ట్ బటన్, ఎల్ఈడీ డీఆర్ఎల్ ప్రోజెక్టర్ హెడ్‌ల్యాంప్ వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా డ్రైవర్ ఎడ్జస్టబుల్ సీట్, సెంట్రల్ కన్సోల్ కూల్ స్టోరేజ్, 182 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. 

రీనాల్ట్ ట్రైబర్‌లో అన్నింటికంటే ప్రత్యేకం సెక్యూరిటీ. సేఫ్టీ కోసం ముందు భాగంలో 2, సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అమర్చారు. గ్లోబల్ ఎన్‌క్యాప్ అయితే ఈ కారుకు 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. పిల్లలకు 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. రీనాల్ట్ ట్రైబర్ ధర దాదాపుగా 5.99 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. ఇందులో టాప్ మోడల్ అంటే 8.12 లక్షలుంటుంది. 

Also read: Mahindra Bolero: ఈ 5 కారణాలతోనే అందరూ మహీంద్రా బొలేరోకు అంత క్రేజ్ ఎక్కువ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News