Best Selling 7 Seater Cars: తక్కువ ధరలో లభిస్తూ అత్యధికంగా అమ్ముడయ్యే 7 సీటర్ కార్ల విషయానికి వస్తే, మారుతి సుజుకి బ్రాండ్ పేరే ముందుగా వినబడుతుంది. ఎందుకంటే మారుతి సుజుకి కంపెనీ 7 సీటర్ కార్ల సెగ్మెంట్‌లో రెండు మోడల్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఒకటి మారుతి ఎర్టిగా కారు కాగా రెండోది మారుతి XL6 మోడల్ కారు. ఈ రెండు కార్లు కూడా 7 సీటర్ కార్లకు ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లకు విపరీతంగా నచ్చేశాయి. అంతేకాదు.. ఎన్నో సందర్భాల్లో మారుతి ఎర్టిగా కారు అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ముందు స్థానంలో నిలిచింది. అయితే ఇదంతా ఈ ఏడాది ఫిబ్రవరి నెలకు ముందు వరకు ఉన్న మారుతి ట్రాక్ రికార్డు మాత్రమే. ఫిబ్రవరి నెల 7 సీటర్ కార్ల సెగ్మెంట్లో మారుతి కంటే ఎక్కువగా అమ్ముడైన కారు వేరే ఉంది.
మారుతి 7 సీటర్ కార్ల అమ్మకానికి బ్రేకులు వేసిన కారు మరేదో కాదు.. రెనాల్ట్ బ్రాండ్ తీసుకొచ్చిన రెనాల్ట్ ట్రైబర్ కారు. మారుతీ XL6 కారు ధర రూ.11.48 లక్షలు నుంచి ప్రారంభం అవుతుండగా.. రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ కారు ధర రూ.6.33 లక్షలు మాత్రమే కావడమే ఈ కార్ల అమ్మకాలకు రెక్కలొచ్చేలా చేయడానికి కారణమైంది. పరిశీలించి చూస్తే.. రెండు కార్ల ధరలో దాదాపు రూ.5 లక్షల వ్యత్యాసం ఉండటం గమనించొచ్చు. 2023 ఫిబ్రవరి నెలలో మారుతి సుజుకి XL6 కార్లు 2,108 యూనిట్లు అమ్ముడు కాగా రెనాల్ట్ ట్రైబర్ కార్లు 3,056 అమ్ముడయ్యాయి. రెనాల్ట్ ట్రైబర్ అమ్మకాలు 27 శాతం వృద్ధి నమోదు కాగా మారుతి ఎక్స్‌ఎల్ 6 అమ్మకాల్లో 36 శాతం క్షీణించాయి.
రెనాల్ట్ ట్రైబర్ ఇంజిన్, ఫీచర్లు
రెనాల్ట్ ట్రైబర్ MPV 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కారు 72PS పవర్, 96Nm టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ విషయానికొస్తే.. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ AMT వెర్షన్స్ లో ఈ కారు లభిస్తోంది. 19kmpl మైలేజ్ అందిస్తుంది.
లేటెస్ట్ కార్లలో వస్తున్న స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఈ కారులో కూడా లభిస్తున్నాయి. డ్రైవర్ ఎత్తు, సౌకర్యానికి అనుగుణంగా ఎత్తు సర్దుబాటు చేసుకునేలా డ్రైవర్ సీటు, డ్యూయల్ హార్న్, టర్న్ ఇండికేటర్స్ అన్ని ఈ కారులో ఉన్నాయి. యాపిల్, ఆండ్రాయిడ్‌తో అనుసంధానం చేస్తూ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్ ఈ 7 సీటర్ కారులో ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Cheap and Best Bikes: ఒక్క నెలలో 2.8 లక్షల కంటే ఎక్కువ అమ్ముడైన బైక్.. ధర కూడా చాలా చీప్
ఇది కూడా చదవండి : Hyundai Cars on Discount: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్
ఇది కూడా చదవండి : Upcoming 7 Seater Cars In India 2023: మారుతి సుజుకి Ertiga కారుకి పోటీగా మరో మూడు 7 సీటర్ కార్లు.. అవేంటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook