Budget Tata Nexon Cars: కేవలం 6 లక్షలకే టాటా నెక్సాన్‌ కారు.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!

Budget Tata Nexon Second Hand Cars Buy Rs 6 Lakhs in Cars24. కార్స్ 24 వెబ్‌సైట్‌లో కొన్ని టాటా నెక్సాన్‌ సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటి ధర దాదాపు రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jan 26, 2023, 02:08 PM IST
  • డెడ్ చీప్‌గా టాటా నెక్సాన్‌ కారు
  • రూ. 6 లక్షలకే టాటా నెక్సాన్‌ కారు
  • రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు
Budget Tata Nexon Cars: కేవలం 6 లక్షలకే టాటా నెక్సాన్‌ కారు.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!

2023 Budget Second Hand Tata Nexon Cars: 2023 ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ అనంతరం అన్ని రకాల వస్తువులు ఖరీదైనవి లేదా చౌకగా మారవచ్చు. ఇందుకు కార్లు మినహాయింపేమీ కాదు. అయితే సెకండ్ హ్యాండ్ కార్లపై బడ్జెట్‌ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. బడ్జెట్ కంటే ముందే కారుని కొనుగోలు చేయాలనుకుంటే.. మీకు కొన్ని ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కార్స్ 24 వెబ్‌సైట్‌లో కొన్ని టాటా నెక్సాన్‌ సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటి ధర దాదాపు రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది. పాత కారును కొనుగోలు చేసిన వ్యక్తి రోడ్డు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్ యజమాని పన్ను ఇప్పటికే చెల్లిస్తాడు.

2019 Tata NEXON KRAZ 1.2 MANUAL:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో 2019 టాటా నెక్సాన్‌ క్రాజ్1.2 మాన్యువల్ ధర రూ.6,11,000లుగా ఉంది. పెట్రోల్ ఇంజన్ కలిగిన ఈ కారు 49,829 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇప్పుడు ఈ కారు మొదటి యజమాని విక్రయానికి పెట్టాడు. నోయిడాలో విక్రయానికి ఉంది.

2019 Tata NEXON XM 1.2 MANUAL:
2019 టాటా నెక్సాన్‌ ఎక్స్ఎం 1.2 మాన్యువల్ ధర రూ. 6,41,000. పెట్రోల్ ఇంజన్ కలిగి ఉన్న ఈ కారు రీడింగ్ 28,834 కిమీ. ఈ కారు ఢిల్లీతో పాటు నోయిడాలో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది.

2019 Tata NEXON XMA 1.5 MANUAL:
2019 టాటా నెక్సాన్‌ ఎక్స్ఎంఏ 1.5 మాన్యువల్ ధర కార్స్ 24 వెబ్‌సైట్‌లో రూ.6,48,000లుగా ఉంబడి. మొదటి యజమాని వద్ద ఈ కార్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. ఈ కారు రీడింగ్ 93,992 కిమీ. ఇది నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

2018 Tata NEXON XT1.5 MANUAL:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో 2018 టాటా నెక్సాన్‌ ఎక్స్టీ 1.5 మాన్యువల్ కారు 76,034 కిమీ తిరిగింది. ధర రూ.6,82,000. మొదటి యజమాని వద్ద ఉన్న ఈ కారు డీజిల్ ఇంజిన్ కలిగి ఉంది. నోయిడాలో ఇది అమ్మకానికి ఉంది.

Also Read: Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్ లేని.. మూడు ఫార్మాట్లను ఊహించడం కష్టమే: సురేశ్‌ రైనా  

Also Read: Republic Day 2023 Cars Offers: రిపబ్లిక్ డే 2023 ఆఫర్‌.. ఈ కార్లపై రూ. 72 వేల డిస్కౌంట్!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News