2022లో ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో భారీ పురోగతి కన్పించింది. వెహికల్ పోర్టల్ గణాంకాల్ని పరిశీలిస్తే..ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విక్రయాల్లో ఏకంగా 305 శాతం వృద్ధి నమోదైంది. ఏడాది వ్యవధిలో 6 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జరిగాయి.
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ పెరుగుతోంది. అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో రావడంతో క్రేజ్ కూడా పెరిగింది. ఏడాది కాలంలో ఏకంగా 6 లక్షల 15 వేల 365 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అమ్మకాలు జరిగాయి. 2019లో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మొత్తం విక్రయాలు కేవలం 28,280 మాత్రమే. 2021 వచ్చేసరికి ఈ సంఖ్య 1.51 లక్షలకు పెరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో ముఖ్యంగా 3 కంపెనీల పాత్ర కీలకం. మొత్తం ఏడాదిలో ఒక్కొక్క కంపెనీ లక్ష యూనిట్ల చొప్పున అమ్మకాలు నమోదు చేశాయి. 2022లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల్లో 3 కంపెనీలున్నాయి.
1. Ola Electric 1,08,130 యూనిట్లు
ఓలా ఎలక్ట్రిక్ 2022 ఏడాదిలో అత్యధిక ఎలక్ట్రిక్ స్కూటర్లు విక్రయాలు జరిపింది. మొత్తం 1, 08,130 యూనిట్లు విక్రయాలు జరిపింది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకూ టాప్ సేలింగ్ కంపెనీగా నిలిచింది. Ola S1, Ola S1 Pro, Ola S1 Air వంటి మోడల్స్ ఉన్నాయి. ఇందులో అన్నింటికంటే ఎక్కువగా ఓలా ఎస్1 ప్రో ఉంది. ఫుల్‌ఛార్జ్‌లో 181 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ మోడల్ ధర 1.40 లక్షలుంది.
2.Okinawa Autotech 1,01,366 యూనిట్లు
ఓకినావా ఆటోటెక్ రెండవ స్థానంలో ఉంది. ఈ కంపెనీ వద్ద హై, స్లో స్పీడ్ రెండు రకాల స్కూటర్లు ఉన్నాయి. iPraise+,Praise Pro మోడల్స్ ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ వద్ద ప్రముఖ మెట్రో నగరాల్లో 350 కంటే ఎక్కువ డీలర్ నెట్‌వర్క్ ఉంది.
3. Hero Electric 96,906 యూనిట్లు
హీరో ఎలక్ట్రిక్ మూడవ స్థానంలో ఉంది. 2022 ఏడాదిలో మొత్తం 96,906 యూనిట్లు విక్రయించింది. మార్చ్ 2022లో 10 వేల యూనిట్ల మార్క్ దాటిన తొలి కంపెనీ ఇదే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook