Best Selling Bikes 2023: బెస్ట్ సెల్లింగ్ బైక్‌లు ఇవే.. ఈ 5 బైక్‌లను గుడ్డిగా కొనేయొచ్చు! ధర కూడా తక్కువే

Hero Splendor and Bajaj Platina are Best Selling Bikes in January 2023 in India. మోటార్‌సైకిళ్ల జాబితాలో హీరో స్ప్లెండ‌ర్ అగ్రస్థానంలో ఉంది. గత నెలలో 2,61,833 యూనిట్ల స్ప్లెండ‌ర్ అమ్మకాలను విక్రయించింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 21, 2023, 02:16 PM IST
  • బెస్ట్ సెల్లింగ్ బైక్‌లు ఇవే
  • ఈ 5 బైక్‌లను గుడ్డిగా కొనేయొచ్చు
  • ధర కూడా తక్కువే
Best Selling Bikes 2023: బెస్ట్ సెల్లింగ్ బైక్‌లు ఇవే.. ఈ 5 బైక్‌లను గుడ్డిగా కొనేయొచ్చు! ధర కూడా తక్కువే

Hero Splendor is Best Selling Bikes in January 2023 in India: 2023 జనవరి నెలలో మోటార్‌సైకిల్ విక్రయాలు జోరందుకున్నాయి. గత నెలలో బైక్ విక్రయాలు 11.63 శాతం పెరిగాయి. అంటే మొత్తంగా  6,56,474 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 జనవరిలో 5,88,105 యూనిట్ల బైక్‌లు అమ్ముడయ్యాయి. మీరు కొత్త బైక్‌ను కొనాలని ప్లాన్ చేసి.. ఏది కొనాలో నిర్ణయించుకోలేకపోతున్నారా?. అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 మోటార్‌సైకిళ్ల జాబితా ఇక్కడ ఉంది. ఈ జాబితా చూస్తే.. చాలా మంది కస్టమర్‌లు ఏ బైక్ ఇష్టపడుతున్నారో తెలుస్కోవచ్చు. దాంతో మీరు సులభంగా ఏ బైక్ కొనాలో ఓ అంచనాకు వచ్చేయొచ్చు.  

1. మోటార్‌సైకిళ్ల జాబితాలో హీరో స్ప్లెండ‌ర్ అగ్రస్థానంలో ఉంది. గత నెలలో 2,61,833 యూనిట్ల స్ప్లెండ‌ర్ అమ్మకాలను విక్రయించింది. జనవరి 2022తో పోలిస్తే అమ్మకాలు 25.72 శాతం ఎక్కువగా ఉన్నాయి.

2. హోండా సీబీ షైన్ 2వ స్థానంలో ఉంది. జనవరి 2023లో 99,878 యూనిట్లను విక్రయించింది. జనవరి 2022 అమ్మకాలతో పోలిస్తే..  హోండా సీబీ షైన్ అమ్మకాలు 5 శాతం క్షీణించాయి.

3. బజాజ్ పల్సర్ నంబర్ 3లో ఉంది. గత నెలలో పల్సర్ విక్రయాలు 26.09 శాతం పెరిగి.. 84,279 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీ ఇటీవలే కొత్త పల్సర్ 220ఎఫ్ బుకింగ్‌లను పునఃప్రారంభించింది.

4. ఈ జాబితాలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ 4వ స్థానంలో ఉంది. ఈ బైక్ విక్రయాలు 44.32 శాతం క్షీణతతో 47,840 యూనిట్లు అమ్ముడయ్యాయి.

5. బజాజ్ ప్లాటినా 5వ స్థానంలో ఉంది. గత నెలలో ఈ బైక్ విక్రయాలు 9.94 శాతం తగ్గి.. 41,873 యూనిట్లకు చేరుకున్నాయి.

టాప్ 5 బైక్‌ల జాబితా:
1. హీరో స్ప్లెండర్ - 2,61,833 యూనిట్లు
2. హోండా సీబీ షైన్ - 99,878 యూనిట్లు
3. బజాజ్ పల్సర్ - 84,279 యూనిట్లు
4. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ - 47,840 యూనిట్లు
5. బజాజ్ ప్లాటినా - 41,873 యూనిట్లు

Also Read: బుసలు కొడుతున్న 20 అడుగుల కింగ్ కోబ్రా.. సింగిల్ హ్యాండ్‌తో పట్టేశాడు! మెంటలెక్కించే వీడియో

Also Read: King Cobra Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. స్నేక్ క్యాచర్‌నే రఫ్ఫాడించిన కింగ్ కోబ్రా.. బంధించి మరీ నీరు త్రాగించిన వ్యక్తి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News