Maruti Suzuki Ertiga sold more than Alto and Wagon R in 2022: డిసెంబర్ 2022లో 'మారుతి సుజుకి' కంపెనీ విక్రయాలలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. మారుతి సుజుకి యొక్క కొన్ని బెస్ట్ సెల్లింగ్ మోడల్స్ అమ్మకాల పరంగా వెనుకబడి పోయాయి. దీని కారణంగా కొన్ని ఇతర మోడల్స్ బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలోకి వచ్చాయి. 'మారుతి సుజుకి ఆల్టో' (Maruti Suzuki Alto) 2022లో చాలా నెలల్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఉంది. అయితే డిసెంబర్ 2022లో మాత్రం ఆల్టో టాప్-10 అమ్ముడవుతున్న కార్ల జాబితాలో కూడా తన స్థానాన్ని నిలుపుకోలేకపోయింది.
అదే సమయంలో వ్యాగన్ఆర్ (Maruti Suzuki Wagon R) కూడా 2022లో అనేక నెలల్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా ఉంది. కానీ డిసెంబర్ 2022 నెలలో వ్యాగన్ఆర్ టాప్-10 అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో దిగువ స్థానానికి పడిపోయింది. 10వ స్థానానికి చేరుకుంది. టాప్-5 కార్లలో 'మారుతి సుజుకి ఎర్టిగా' (Maruti Suzuki Ertiga) ఉంది. డిసెంబర్ 2022లో అత్యధికంగా అమ్ముడైన కార్ జాబితాలో ఎర్టిగా రెండవ స్థానంలో నిలిచింది. 7-సీటర్ మారుతి సుజుకి ఎర్టిగా 12,273 యూనిట్లను విక్రయించి రెండవ స్థానంలో ఉంది. మారుతి సుజుకి బాలెనో అత్యధికంగా 16,932 యూనిట్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన బాలెనో అమ్మకాలు (డిసెంబర్ 2021తో పోలిస్తే) 17.11 శాతం పెరిగాయి.
మారుతి సుజుకి ఎర్టిగా కార్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ కారు 103 PS/136.8 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలో అందుబాటులో ఉంది. అంతేకాదు CNG కిట్ ఎంపిక కూడా ఉంది. ఈ కారు CNGపై 88 PS మరియు 121.5 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
మారుతి సుజుకి ఎర్టిగా కార్ ధర రూ. 8.35 నుంచి 12.79 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఎర్టిగా 7 సీట్ల కారు. దీని బూట్ స్పేస్ 209 లీటర్లు. మూడవ వరుస సీట్లను మడతపెట్టడం ద్వారా.. బూట్ స్పేస్‌ను పెంచుకోవచ్చు. సీట్లను మడతపెట్టడం ద్వారా బూట్ స్పేస్ 550 లీటర్లు అవుతుంది. ఈ చౌకైన 7 సీటర్ కారుకు ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
Also Read: KL Rahul: బంతి అలా వస్తుంటే.. ఆడటం నాకు చాలా ఇష్టం: కేఎల్ రాహుల్
Also Read: Maruti New SUV: హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్‌లకు పోటీగా.. మారుతీ సుజుకీ నుంచి కొత్త ఎస్‌యూవీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.