Adani Group: సిమెంట్ రంగ దిగ్గజాల వాటాదారులకు అదానీ గ్రూప్ వచ్చే వారం ఓపెన్ ఆఫర్ ప్రకటించే అవకాశం ఉంది. స్విస్ దిగ్గజం హోల్సిమ్‌కు చెందిన భారతీయ లిస్టెడ్ ఎంటిటీలు అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లో యాజమాన్య వాటా కొనుగోలుకి గత మేలో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా రెండు సిమెంట్ దిగ్గజాల వాటాదారుల నుంచి మరో 26 శాతం చొప్పున వాటాలు సొంతం చేసుకునేందుకు ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. ఇందుకు గాను రూ. 31000 కోట్లు వెచ్చించే అవకాశం ఉంది.
మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇప్పటికే అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంబుజా సిమెంట్స్, ఏసీసీ లిమిటెడ్‌లలో మెజారిటీ వాటా కొనుగోలుకి ఇప్పటికే అదానీ గ్రూప్ రూ. 50181 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకుంది. అదానీ గ్రూప్ మొత్తం 10.5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఏసీసీ, అంబుజా సిమెంట్ వాటాదారులకు అదానీ గ్రూప్ సంస్థ ఎండీవర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆగష్టు 26 నుంచి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించనుంది. సెప్టెంబర్ 9న ఈ ఆఫర్ ముగియనుంది.
ఓపెన్ ఆఫర్‌లో ఏసీసీ వాటాదారులకు షేరుకి రూ. 2300, అంబుజా సిమెంట్ వాటాదారులకు షేరుకి రూ. 385 చొప్పున కొనుగోలు చేయనుంది. అంబుజా సిమెంట్స్‌కు చెందిన 51.63 కోట్ల షేర్ల కొనుగోలుకి రూ. 19880 కోట్లు, ఏసీసీకు చెందిన 4.89 కోట్ల షేర్ల కొనుగోలుకి రూ. 11260 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయనుంది. అనుబంధ సంస్థల ద్వారా అంబుజాలో 63.19 శాతం, ఏసీసీలో 54.53 శాతం చొప్పున హోల్సిమ్ వాటాలు ఉన్నాయి. రెండు సంస్థల ప్రస్తుత సామర్థ్యం వార్షికంగా 7 కోట్ల టన్నులు. భారత దేశ వ్యాప్తంగా 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీమిక్స్ యూనిట్లు ఉన్నాయి.
Also Read: Megastar Chiranjeevi rare photos: మీరెప్పుడూ చూడని మెగాస్టార్ ఫోటోలు
Also Read: Amit Shah Ntr Meet: అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. 20 నిమిషాల ఏకాంత చర్చలు.. ఇంతకీ ఏం మాట్లాడుకున్నారు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి