Adani Group: పుంజుకుంటున్న అదానీ గ్రూప్ షేర్లు, రెండ్రోజుల్లో 39 వేల కోట్ల మార్కెట్ వాటా

Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో పతనం దిశగా సాగుతున్న అదానీ కంపెనీ షేర్లలో తిరిగి పెరుగుదల నమోదవుతోంది. ఫలితంగా రెండ్రోజుల్లో 30 శాతం వృద్ధితో ఏకంగా 39 వేల కోట్ల మార్కెట్ వాటా పెరిగింది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 1, 2023, 06:22 PM IST
Adani Group: పుంజుకుంటున్న అదానీ గ్రూప్ షేర్లు, రెండ్రోజుల్లో 39 వేల కోట్ల మార్కెట్ వాటా

జనవరి 24వ తేదీన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వెలువడిన తరువాత గౌతమ్ అదానీ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. కేవలం నెలరోజుల వ్యవధిలో ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానం నుంచి 30వ స్థానానికి పడిపోయారు. మరోవైపు అదానీ గ్రూప్ సంపద 12 లక్షల కోట్లు ఆవిరైంది. 

మార్కెట్‌లో మొన్నటి వరకూ శరవేగంగా క్షీణించిన అదానీ గ్రూప్ షేర్లు తిరిగి ఇప్పుడు పుంజుకుంటున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్లు గత రెండ్రోజుల్లో 30 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఫలితంగా రెండ్రోజుల్లో అదానీ గ్రూప్ మార్కెట్ వాటా 39 వేల కోట్లు సమీకరించింది. అదానీ గ్రూప్‌కు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు ఇవాళ వరుసగా రెండవరోజు కూడా గ్రీన్ కలర్‌లో ట్రేడ్ అయ్యాయి. గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ 39 వేల కోట్లు పెరగడంతో 7.50 లక్షల కోట్లకు చేరుకుంది. అదానీ గ్రూప్‌లో కీలకమైన అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ ఎన్ఎస్ఈలో 15 శాతం వృద్ధితో 1563 రూపాయలకు చేరుకుంది. అటు నిఫ్టీలో టాప్ 50 గెయినర్స్‌లో చేరింది. 

గత రెండ్రోజుల్లో అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ 30 శాతం పెరిగింది. నిన్న మంగళవారం నాడు 14 శాతం వృద్ధితో , ఇవాళ బుధవారం నాడు 15 శాతం వృద్ధితో షేర్ విలువ 1563 రూపాయలకు చేరుకుంది. అదానీ పోర్ట్స్ షేర్ 2.64 శాతం పెరిగి 608.25 రూపాయలైంది. అటు అంబూజా సిమెంట్స్ 2.27 శాతం పెరిగి 349.80 రూపాయలకు చేరుకుంది. ఇక ఏసీసీ సిమెంట్స్ షేర్ 1.33 శాతం పడిపోవడంతో 1755.25 రూపాయలకు చేరుకుంది. ఇక ఆ తరువాత అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మర్, అదానీ గ్రీన్ ఎనర్జీస్, ఎన్డీటీవీ, అదానీ పవర్ కంపెనీలు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌లో నిలిచాయి.

అదాని గ్రూప్‌కు చెందిన అన్ని కంపెనీల షేర్లు ఇవాళ అంటే బుధవారం నాడు పుంజుకోవడానికి కారణం అదానీ గ్రూప్ కు 800 మిలియన్ డాలర్ల రుణం కోసం అనుకూలత ఏర్పడిందనే వార్తలు రావడమే. గ్రూప్ రుణాల్ని రీఫైనాన్స్ చేసేందుకు లేదా మూలధనాన్ని నింపేందుకు ప్రయత్నించడం లేదని అదానీ గ్రూప్ ఫైనాన్స్ ఛీఫ్ తెలిపారు. ఇటీవల రాయిటర్స్ నివేదిక సైతం మార్చ్ ఆఖరుకు అదానీ గ్రూప్ 690 మిలియన్ డాలర్ల నుంచి 790 మిలియన్ డాలర్ల వరకూ ఈక్విటీ ఆధారిత రుణాన్ని ముందస్తుగా చెల్లించాలని భావిస్తోంది. 

Also read: Hyundai Micro SUV: హ్యుందాయ్ నుంచి చౌకైన ఎస్‌యూవీ.. ఇక టాటా పంచ్ కౌంట్ డౌన్ ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook al

Trending News